16మంది కంటెస్టెంట్స్ కి గాను 15మందిని నాగార్జున పరిచయం చేశారు. 14వ కంటెస్టెంట్ గా నటుడు విశ్వ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఇక తన ఇంట్రో వీడియోలో విశ్వ తన జీవితం ఆవిష్కరించారు.
బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ పై పూర్తి అవగాహనా వచ్చేసింది. 16మంది కంటెస్టెంట్స్ కి గాను 15మందిని నాగార్జున పరిచయం చేశారు. 14వ కంటెస్టెంట్ గా నటుడు విశ్వ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఇక తన ఇంట్రో వీడియోలో విశ్వ తన జీవితం ఆవిష్కరించారు. జీవితంలో తాను ఎన్ని బాధలు పడ్డారో తెలియజేశారు. ఆర్థిక బాధలు, బ్రదర్ మరణం వంటి సంఘటనలు తనను మానసిక వేదనకు గురిచేశాయని, అయితే వాటన్నిటికీ ఎదిరించి నిలిచినట్లు తెలిపారు.
వేదికపై కూడా నాగ్ విశ్వ గ్రేట్నెస్ ని కొనియాడారు. నటుడిగా, బాడీ బిల్డర్ గా, డబ్ల్యూ డబ్ల్యూ ఈ ఫైటర్ గా కూడా ట్రై చేశారని తెలుసుకొని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక నాగార్జున నిర్మించిన మొదటి సీరియల్ యువలో తాను నటించినట్లు విశ్వ తెలిపారు. అలాగే చైతన్య మొదటి సినిమాలో కూడా తాను నాగ్ కోరిక మేరకు నటించినట్లు గుర్తు చేశారు. మొత్తంగా నాగార్జునతో అనుబంధాన్ని విశ్వ గుర్తు చేసుకున్నారు. ఇక నాగ్ కోరిక మేరకు తన చేతులతో ఆపిల్స్ బద్దలు చేసి చూపించారు. హౌస్ మేట్స్ తో కొంచెం సున్నితంగా వ్యవహరించాలని నాగ్, విశ్వకి చెప్పారు.
ఇక 15వ కంటెస్టెంట్ గా సీరియల్ నటి ఉమాదేవి హౌస్లోకి ప్రవేశించారు. అనేక ఫ్యామిలీ ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపారు. ఇక సీరియల్స్ లో గయ్యాళిగా కనిపించిన ఉమాదేవి నిజంగా ఏమిటో చూపిస్తానని ఉమాదేవి తెలిపారు.
