Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ హౌస్ లో నటుడు లోబో... మోడల్ జెస్సి, ఆసక్తి రేపుతున్న సీజన్ 5 కంటెస్టెంట్స్

బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ లో దాదాపు సగం మంది కంటెస్టెంట్స్ పరిచయం అయ్యారు. ఆరవ కంటెస్టెంట్ గా బుల్లితెర సెలబ్రిటీ, నటుడు లోబో వేదికపైకి రావడం జరిగింది. ఏడు రంగులు ఉంటే రైన్ బో, ఒక రంగు ఉంటే లోబో అంటూ.. నాగ్ లోబో హెయిర్ స్టైల్ ని ఉద్దేశిస్తూ అన్నారు. 

bigg boss season 5 actor lobo as sixth model jessi as eight contestants
Author
Hyderabad, First Published Sep 5, 2021, 8:08 PM IST


బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ లో దాదాపు సగం మంది కంటెస్టెంట్స్ పరిచయం అయ్యారు. ఆరవ కంటెస్టెంట్ గా బుల్లితెర సెలబ్రిటీ, నటుడు లోబో వేదికపైకి రావడం జరిగింది. ఏడు రంగులు ఉంటే రైన్ బో, ఒక రంగు ఉంటే లోబో అంటూ.. నాగ్ లోబో హెయిర్ స్టైల్ ని ఉద్దేశిస్తూ అన్నారు. ఇక ఇంట్రో వీడియోలో లోబో తన లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. లోబో డ్రెస్సింగ్ స్టైల్, టాటూలు, బట్టలు చూసి ఇతరులు తండ్రి వద్ద ఏకగతాళిగా మాట్లాడేవారని చెప్పాడు. 


నాన్న బ్రతికి ఉన్నప్పుడు ఆయనకు సరైన గౌరవం ఇవ్వలేదని, ఆయన లేకపోతే ఆ బాధ ఏమిటో తెలుస్తుందని తెలియజేశారు. ఇక లోబో కేవలం 9వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడట. భార్య రాకతో జీవితం మారిందని, భార్య, కూతురును వీడియోలో పరిచయం చేశాడు. 


అనంతరం ఎనిమిదవ కంటెస్టెంట్ గా మోడల్, టీచర్, రాంప్ వాల్కర్ జెస్సి ఎంట్రీ ఇచ్చారు. జెస్సి పేరిట 36 గంటలు నాన్ స్టాప్ గా రాంప్ వాక్ చేయించిన రికార్డు ఉందని నాగార్జున గుర్తు చేశారు.జెస్సి చేత నాగార్జున వేదికపై రాంప్ వాక్ చేయించారు. రాంప్ వాక్ చేసేటప్పుడు మోడల్స్ ముఖాల్లో ఎక్స్ ప్రెషన్స్ ఎందుకు ఉండవని, జెస్సిని నాగార్జున అడిగి తెలుసుకున్నారు. 


ఆడియన్స్ ద్రుష్టి కేవలం మోడల్స్ ధరించిన కాస్ట్యూమ్స్ పైనే ఉండాలి, అందుకే మోడల్స్ షాప్స్ లో ఉండే మానికూర్స్ మాదిరి ముఖాల్లో ఎటువంటి ఎక్స్ ప్రెషన్స్ లేకుండా వాక్ చేస్తారని అన్నారు. లోబో, జెస్సిలను సాదరంగా హౌస్లోకి పంపించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios