నాగార్జున సారథ్యంలో పాప్యులర్ రియాలిటీ షో భారీ రికార్డు నమోదు చేసింది. దేశంలోనే అత్యధికమంది వీక్షించిన షోగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఫినాలే నిలిచింది. ఏకంగా 21.7 టీఆర్పీ అందుకున్న బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్... అరుదైన రికార్డు అందుకుంది. ఈ సక్సెస్ ని హోస్ట్ నాగార్జున సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు . ప్రేక్షకుల వలనే ఇంతటి విజయం సాధించినట్లు నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు. సల్మాన్ నేతృత్వంలోని హిందీ బిగ్ బాస్ షో కూడా ఈ స్థాయి రేటింగ్ అందుకోకపోవడం విశేషం.  

డిసెంబర్‌20,2020వ తేదీన అభిజీత్‌ దుడ్డాలను తమ నాల్గవ సీజన్‌ విజేతగా బిగ్‌బాస్‌ ప్రకటించాడు.ఈ కార్యక్రమం టెలివిజన్‌ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. రికార్డు స్థాయిలో 21.7 టీవీఆర్‌ రేటింగ్స్‌ను సాధించింది. అర్బన్‌ 15+ వీక్షకుల నడుమ హెచ్‌డీ వీక్షకులతో కూడా కలిపి ఈ రేటింగ్‌ సాధించింది. జంట నగరాలలో రికార్డు స్థాయిలో  12.3 మిలియన్‌ల  ఇంప్రెషన్స్‌ ఈ షోకు నమోదయ్యాయి. తద్వారా ఈ షో సాటిలేని వీక్షణ అనుభవాలను నమోదు చేసింది. సోషల్‌ మీడియాలో ఇప్పటికే 2021 లో తరువాత సీజన్‌ను త్వరగా ప్రారంభించాల్సిందిగా కోరుతూ ట్రెండింగ్‌ కూడా చేస్తున్నారు.  తమ వైవిధ్యమైన, సంపూర్ణమైన నాయకత్వంతో స్టార్‌ మా, 2021లో అత్యున్నత శిఖరాలను పలు  ఫిక్షన్‌ మరియు నాన్‌ ఫిక్షన్‌ షోలతో అధిరోహించింది.

ఫైనల్ కి చేరిన అభిజీత్, అఖిల్, సోహెల్, అరియనా మరియు హరికలలో అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా, అఖిల్ రన్నర్ గా రెండో స్థానంలో నిలిచాడు. నాగార్జున ఆఫర్ చేసిన రూ. 25 లక్షలు తీసుకున్న సోహెల్ మూడవ స్థానంతో టైటిల్ రేసునుండి తప్పుకున్నారు. ఫైనల్ కి చేరిన ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ అరియనా నాలుగు, హారిక ఐదవ స్థానాలను పొందడం జరిగింది.