బిగ్ బాస్ ఓటీటీ రెండో వారానికి చేరుకుంది. దీంతో మరొకరి ఎలిమినేషన్ కి రంగం సిద్ధమైంది. కాగా ఈ ఆదివారం ఆ హాట్ బాంబు ఇంటి నుండి అవుట్ అన్నమాట గట్టిగా వినిపిస్తోంది.
బిగ్ బాస్ నాన్ స్టాప్ (Biggboss Nonstop)డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. నాగార్జున హోస్ట్ 17మంది కంటెస్టెంట్స్ తో ఫిబ్రవరి 26వ తేదీన బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ గా ప్రారంభమైంది. గత ఐదు సీజన్స్ లో పాల్గొన్న పాత కొత్త కంటెస్టెంట్స్ మేళవింపుగా బిగ్ బాస్ నాన్ స్టాప్ సిద్ధం చేశారు. పాత కంటెస్టెంట్స్ ని వారియర్స్ గా, కొత్త కంటెస్టెంట్స్ ని ఛాలెంజర్స్ గా విభజించడం జరిగింది.
ఇక ఈ వారం సరయు,అఖిల్,హమీదా, అనిల్,మిత్ర శర్మ, అరియానా, శివ, నటరాజ్ మాస్టర్, అషూ రెడ్డి, శ్రీరాపాక, మహేశ్ విట్టా.. మొత్తం 11 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో శ్రీరాపాక హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నామినేషన్స్ లిస్ట్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో అందరి కంటే వీక్ గా శ్రీరాపాకనే ఈ వారం ఎలిమినేట్ అయినట్లు సమాచారం అందుతుంది.
మరి ఇదే నిజమైతే మరో హాట్ బాంబు హౌస్ ని వీడినట్లే. ఫ్యాషన్ డిజైనర్ గా కెరీర్ కొనసాగిస్తున్న శ్రీరాపాక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన నగ్నం మూవీలో హీరోయిన్ గా నటించారు. ఆ మూవీలో దారుణమైన బోల్డ్ సన్నివేశాల్లో ఆమె హద్దులు లేని స్కిన్ షో చేశారు. నగ్నం మూవీతో శ్రీరాపాక ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు.
కాగా మొదటి వారం ఐటమ్ బాంబు ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యారు. సరయు, ముమైత్ అతి తక్కువ ఓట్లు పొందారు. ఉత్కంఠ మధ్య సాగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ముమైత్ ఇంటిని వీడాల్సిందిగా నాగార్జున ప్రకటించారు. మరోవైపు బిగ్ బాస్ నాన్ స్టాప్ కి అనుకున్నంత ఆదరణ దక్కడం లేదు. గేమ్ లో మజా లేకపోవడంతో పాటు కంటెస్టెంట్స్ పట్ల ప్రేక్షకులు ఆసక్తిగా లేకపోవడంతో షో డీలా పడినట్లు సమాచారం.
