బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ లో పాత కంటెస్టెంట్స్ కొత్త కంటెస్టెంట్స్ కలిసి గేమ్ ఆడుతున్న విషయం తెలిసిందే. కాగా గత ఐదు సీజన్స్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ని వారియర్స్ గా, అసలు పాల్గొనని కంటెస్టెంట్స్ ని చాలెంజర్స్ గా విభజించారు. 

బిగ్ బాస్ నాన్ స్టాప్ (Bigg boss nonstop) గ్రాండ్ గా నేడు లాంచ్ అయ్యింది. నాగార్జున (Nagarjuna) హౌస్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. అలాగే షో గురించి ఇప్పటివరకు తెలియని విషయం బయటపెట్టారు. బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ లో పాత కంటెస్టెంట్స్ కొత్త కంటెస్టెంట్స్ కలిసి గేమ్ ఆడుతున్న విషయం తెలిసిందే. కాగా గత ఐదు సీజన్స్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ని వారియర్స్ గా, అసలు పాల్గొనని కంటెస్టెంట్స్ ని ఛాలెంజర్స్ గా విభజించారు. అంటే టాస్క్, గేమ్స్ కూడా వారియర్స్, ఛాలెంజర్స్ మధ్య నడుస్తాయేమో చూడాలి. 

ఇక మొదటి కంటెస్టెంట్ గా అషురెడ్డి(Aashureddy) ఎంట్రీ ఇచ్చింది. ఆమె సమంత ఊ అంటావా సాంగ్ తో సాలిడ్ ఇంట్రో ఇచ్చారు. ఇక నాగ్ కోసం మూడు రోజాలు తెచ్చిన అషురెడ్డి నాగార్జునకు ఇచ్చారు. ఇక హౌస్ లోకి వెళుతూ వెళుతూ నాగార్జున బుగ్గపై గట్టిగా కిస్ పెట్టారు. ఇకపై అషురెడ్డి ఆట చూస్తారని, చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. మొత్తంగా గత అనుభవాలతో ఈ సీజన్లో మంచిగా పెర్ఫార్మన్స్ చేస్తానని హామీ ఇచ్చారు. 

ఇక బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ లో మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు.కాగా బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ రెగ్యులర్ బిగ్ బాస్ షోకి చాలా భిన్నం. ఇది 24/7 ప్రసారం కానుంది. అంటే ప్రతి నిమిషం కంటెస్టెంట్స్ గేమ్ లో భాగంగా ఉంటారు. గేమ్స్, టాస్క్ విషయంలో మాత్రం పోలిక ఉంటుంది. ఇక బిగ్ బాస్ ఓటిటి వర్షన్ కి పరిమితులు తక్కువ. అంటే రొమాన్స్ పాళ్ళు ఎక్కువగా ఉండే ఆస్కారం కలదు. బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోలోనే కంటెస్టెంట్స్ ఓ రేంజ్ రొమాన్స్ కురిపిస్తున్నారు. ఇది ఓటీటీ కాబట్టి అడల్ట్ కంటెంట్ పరిమితులు దాటిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.