ఆసక్తికరంగా సాగుతున్న బిగ్ బాస్ షో చివరి వారం ముగిసిన నామినేషన్లు ఫైనల్ కి చేరిన నవదీప్, శివబాలాజీ

ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్న బుల్లి తెర రియాల్టీ షో ‘బిగ్ బాస్’ ఆసక్తికరంగా సాగుతోంది. టైటిల్ విన్నర్ రేసులో ఉన్న ప్రిన్స్.. అనుహ్యంగా హౌజ్ నుంచి ఔట్ అయ్యారు. అనుకోని ఈ సంఘటనతో హౌజ్ లోని సభ్యులంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ప్రిన్స్ వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలని హరితేజ, అర్చన.. తన కోసం కొద్ది సేపు బాధపడ్డారు. దీక్షపై ప్రిన్స్ విసిరిన బిగ్ బాంబ్‌ శిక్షను బిగ్ బాస్ రద్దుచేశారు. ఆమె అనారోగ్యం కారణంగా ఈ శిక్షను రద్దు చేస్తున్నట్టు తెలిపారు బిగ్ బాస్. ఇక దీక్ష- హరితేజల మధ్య చిన్న వివాదం నడిచింది. హరితేజ తన తప్పుఉన్నా ఒప్పుకోదని ఎప్పుడూ ఒకరిపై నింద మోపేందుకే ప్రయత్నిందని ఆరోపించింది దీక్ష.



ఇక ఈవారం ఎలిమినేషన్స్ కోసం నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టారు బిగ్ బాస్. బిగ్‌బాస్ చివరి అంకానికి చేరుకోవడంతో మిగిలిని ఆరుగురు ఒక్కొక్కరుగా ఇద్దరిద్దరి పేర్లను చెప్పి వారికి కాకరకాయ రసాన్ని తాగించి ఎందుకు నామినేట్ చేస్తున్నారో కారణాన్ని తెలియజేయాలన్నారు. ఈ వారం నామినేషన్లలో హరితేజ, అర్చన, దీక్ష, ఆదర్శ్ నిలిచారు. ఇది చివరి వారం నామినేషన్ కావడంతో.. వీరిలో నుంచి ఇద్దరు నామినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. ఇక ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగానే దీక్ష తనను కావాలని నామినేట్ చేయాలని ఎప్పటినుండో ప్లాన్ చేస్తున్నారంటూ దీక్ష తానో స్ట్రాంగ్ కన్టెస్టెంట్‌గా ఫీల్ అవుతూ ఆదర్శ్ తో చర్చలు మొదలు పెట్టింది.


ఇక హౌస్‌ నుండి ఇప్పటికే ఎలిమినేట్ అయిన ధనరాజ్, కత్తి కార్తీక, సంపూర్ణేష్ బాబు, కత్తి మహేష్‌లు వీడియో కాల్ ద్వారా హౌస్ మేట్స్ తో ముచ్చటించారు. తాము వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మళ్లీ వస్తున్నాం అని మా నలుగురిలో ఎవరికి ఓటేస్తారంటూ ధనరాజ్ అడగగా మళ్లీ మీరెందుకులే ఎవరూ వద్దంటూ శివబాలాజీ కుండబద్దలు కొట్టేశాడు. ఇక ఈరోజు ఎపిసోడ్‌లో ఆదర్శ్ భార్య గుల్నార్ బిగ్ బాస్ హౌస్‌కి రావడం.. ప్రిన్స్ పంపిన సందేశాన్ని చదవడంతో ఆదర్శ్ బాగా ఎమోషన్ అవుతున్నాడు. ఈ సందేశంలో ఏమున్నదో ఈరోజు ఎపిసోడ్‌లో తేలనుంది.