గత ఏడాది బిగ్ బాస్ తెలుగు 6 షోతో నటి కీర్తి భట్ అందరి హృదయాలు గెలుచుకుంది. సెకండ్ రన్నర్ గా నిలిచింది. కీర్తి తన జీవితంలో ఎదుర్కొన్న విషాదకర సంఘటనలతో ఆడియన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అయింది.
గత ఏడాది బిగ్ బాస్ తెలుగు 6 షోతో నటి కీర్తి భట్ అందరి హృదయాలు గెలుచుకుంది. సెకండ్ రన్నర్ గా నిలిచింది. కీర్తి తన జీవితంలో ఎదుర్కొన్న విషాదకర సంఘటనలతో ఆడియన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అయింది. కీర్తి భట్ తన ఫ్యామిలీని కోల్పోయి ఒంటరిగా మిగిలింది. ఒంటరిగానే ఈ స్థాయి వరకు చేరుకుంది.ఆమె కుటుంబం రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.
తన కుటుంబం వెంటలేనప్పటికీ కీర్తి చిత్ర పరిశ్రమలో రాణిస్తూ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రస్తుతం కొన్ని టీవీ సీరియల్స్ లో నటిస్తోంది. ఇదిలా ఉండగా ఎట్టకేలకు కీర్తి పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అవుతోంది. రీసెంట్ గా ఆమె నిశ్చితార్థం కూడా సినిమాటిక్ లెవల్ లో ఓ షోలో జరిగింది. తనకి కాబోయే భర్తని.. అత్త మామలని వేదికపై కీర్తి ఆడియన్స్ కి పరిచయం చేసింది.
కీర్తికి కాబోయే భర్త కూడా నటుడే. అతడి పేరు విజయ్ కార్తీక్, విజయ్ సొంత ఊరు మదనపల్లి. పుట్టి పెరిగింది చిత్తూరు జిల్లాలోనే. ఆ తర్వాత చదువు, ఉద్యోగం కోసం బెంగుళూరుకి వెళ్ళాడు. అతడి తల్లి కర్ణాటకకి చెందిన మహిళ కావడంతో ఫ్యామిలీ బేస్ అక్కడ కూడా ఉంది. ఇక సాఫ్ట్ వేర్ గా ఉద్యోగం చేస్తున్న సమయంలో సినిమాలపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు.
కన్నడలో కొన్ని చిత్రాల్లో హీరోగా నటించాడు. తెలుగులో ఏబీ పాజిటివ్, చెడ్డి గ్యాంగ్ లాంటి చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం దర్శకుడుగా, నటుడిగా విజయ్ కార్తీక్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఓ ఓ టివి షోలో వీరిద్దరి నిశ్చితార్థం రొమాంటిక్ గా, ఎమోషనల్ గా జరిగింది. ఇద్దరూ పూలదండలు మార్చుకున్నారు.
కీర్తి మాట్లాడుతూ.. నేను నీతోనే ఉంటా, నీకు సపోర్ట్ గా ఉంటా.. నీ పేరెంట్స్ ని నా పేరెంట్స్ అనుకుంటా. నన్ను వదలకుండా ఇలాగే చూసుకో అంటూ కీర్తి కంటతడి పెట్టుకుంది. అంతే కాదు.. నేను వాళ్ళ ఇంటికి కోడలిగా వెళుతున్నా. వాళ్ళ ఫ్యామిలీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లలేను. ఆ మాట చెప్పినప్పుడు.. నీకు పాప ఎందుకమ్మా నువ్వే మా పాప.. మనం అడాప్ట్ చేసుకుందాం లే అని అన్నారు అంటూ తన అత్తమామల గురించి తెలిపింది. యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడడం వల్ల కీర్తి పిల్లలని కనలేదని వైద్యులు తెలిపారట. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
