బిగ్ బాస్ మరో వీకెండ్ కి చేరుకోగా, హోస్ట్ నాగార్జున వేదికపైకి వచ్చేశాడు. గత వారం టాస్క్ లతో అలసిపోయామని కంటెస్టెంట్స్ నిన్నటి ఎపిసోడ్ లో కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అందుకేనేమో బహుశా పెద్దగా, గొడవలు పెట్టే గేమ్స్ లేకుండా నాగార్జున హౌస్ ని సాఫీగా నడిపించేశాడు.కాకపోతే మోనాల్, అభిజిత్ మధ్య ఏర్పడిన పంచాయితీని తీర్చడం జరిగింది. మోనాల్ నిజంగానే కాలితో తన్నినట్లు ఉందని, మెజారిటీ ఇంటి సభ్యులు వీడియో చూసి తెలపడంతో నాగార్జున అవినాష్ కి ఆమెతో క్షమాపణ చెప్పించారు. 

వ్యక్తిగతంగా ఆడాల్సిన గేమ్ ని అఖిల్, సోహైల్ టీమ్ గా ఆడారు అనే ఆరోపణ కూడా అవినాష్ చేయడం జరిగింది. ఈ విషయంలో నాగార్జున అఖిల్, సోహైల్ ని సమర్ధించాడు. ఇక నామినేషన్స్ లో మొత్తం ఐదుగురు సభ్యులు ఉండగా, నేడు బిగ్ బాస్ ఒకరిని సేవ్ చేశాడు. అఖిల్ సేవ్ అయినట్లు ప్రకటించడం జరిగింది. టికెట్ టు ఫినాలే గెలుచుకున్నప్పటికీ ఎలిమినేటైతే అది దక్కదు కావున, అఖిల్ చాలా టెన్షన్ పడ్డాడు. నేడే దానిపై క్లారిటీ ఇచ్చి, అఖిల్ కి ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేశాడు నాగార్జున. 

ఫైనల్ కి ఎంపికైన మొదటి కంటెస్టెంట్ గా అఖిల్ సార్థక్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు బిగ్ బాస్ మరియు నాగార్జున. ఇంటి సభ్యులు కూడా అఖిల్ కి అభినందలు తెలిపారు. ఇక మిగిలిన ఆరుగురు సభ్యుల నుండి ఇద్దరు ఎలిమినేటై, నలుగురు ఫైనల్ కి వెళతారు. ఈ వారం నామినేషన్స్ లో అభిజిత్, అవినాష్, మోనాల్ మరియు హారిక ఉన్నారు. వీరిలో ఒకరు రేపు హౌస్ వీడనున్నారు.