బిగ్ బాస్ వీ జే సన్నీ హీరోగా తెరకెక్కుతున్న అన్ స్టాపబుల్ చిత్ర ప్రోమో షూటింగ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. వీ జే సన్నీకి డమ్మీ బుల్లెట్ అతి దగ్గరగా తగిలింది.
డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా అన్ స్టాపబుల్ మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్ర ప్రోమోను డైరెక్టర్ స్పెషల్ గా షూట్ చేస్తున్నారు. థర్టీ ఇయర్స్ పృథ్వి, సప్తగిరి, వీజే సన్నీ ఈ ప్రోమో షూట్ లో పాల్గొన్నారు. పోలీస్ గెటప్ లో ఉన్న సప్తగిరి రివాల్వర్ చూపిస్తూ 30 ఇయర్స్ పృథ్విని 'అన్ స్టాపబుల్' మూవీ రిలీజ్ ఎప్పుడని అడిగాడు. థర్టీ ఇయర్స్ పృథ్వి నాకు తెలియదని సమాధానం చెప్పాడు. సీన్లోకి వచ్చిన వీ జే సన్నీకి రివాల్వర్ ఎక్కుపెట్టి సప్తగిరి అతన్ని కూడా అదే ప్రశ్న అడిగారు.
ఈ క్రమంలో సప్తగిరి చేతిలో ఉన్న రివాల్వర్ పొరపాటున పేలింది. అందులో ఉన్న బుల్లెట్ అతి దగ్గరగా సన్నీ భుజానికి తాకింది. అది డమ్మీ బుల్లెట్ అయినప్పటికీ సన్నీ గాయాలపాలైనట్లు తెలుస్తుంది. వెంటనే యూనిట్ ఆయన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారని సమాచారం. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది ప్రమోషనల్ స్టంట్ కూడా కావొచ్చని కొందరి అభిప్రాయం. ఈ మధ్య చిన్న చిత్రాల హీరోలు ఫ్రాంక్ వీడియోలతో తమ చిత్రాలకు ప్రీ పబ్లిసిటీ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. సన్నీ నటించిన ఏటీఎం వెబ్ సిరీస్ విడుదలకు ముందు ఏటీఎం ను దొంగిలించి పారిపోతున్నట్లు ఓ సీసీ టీవీ ఫుటేజ్ విడుదల చేశారు. ఉగ్రం చిత్ర ప్రమోషన్స్ కోసం యాంకర్ సుమను అరెస్ట్ చేసినట్లు ఫోటోలు విడుదల చేశారు. కాబట్టి ఇది కూడా అలాంటిదే కావచ్చని ఒక అంచనా...
ఇక అన్ స్టాపబుల్ మూవీలో వీజే సన్నీ, సప్తగిరి ప్రధాన పాత్రలు చేస్తున్నారు. పోసాని, 30 ఇయర్స్ పృథ్వి, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, బిత్తిరి సత్తి... ఇలా టాలీవుడ్ కమెడియన్ గ్యాంగ్ మొత్తం నటిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. రజిత్ రావ్ నిర్మిస్తున్నారు. 
