Asianet News TeluguAsianet News Telugu

నటుడు పవన్ కళ్యాణ్ తో ఘనంగా బిగ్ బాస్ వాసంతి వివాహం!


బిగ్ బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్ పెళ్లి పీటలు ఎక్కింది. ఆమె ప్రియుడు పవన్ కళ్యాణ్ తో ఏడడుగులు వేసింది. తిరుపతిలో వారి వివాహం జరగ్గా బంధు మిత్రులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. 
 

bigg boss fame vasanthi krishnan gets marriage with actor pawan kalyan ksr
Author
First Published Feb 21, 2024, 10:52 AM IST | Last Updated Feb 21, 2024, 10:57 AM IST

నటి వాసంతి బిగ్ బాస్ తెలుగు 6లో పాల్గొన్న విషయం తెలిసిందే. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హౌస్లో 10 వారాలు ఉంది. వాసంతిపై ఒకరిద్దరు మేల్ కంటెస్టెంట్స్ మనసు పడ్డారు. అయితే అమ్మడు ఒక లైన్ మైంటైన్ చేసింది. ఎవరికీ పడలేదు. కేవలం గ్లామర్, తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేసింది. కాగా వాసంతి కొన్నాళ్లుగా నటుడు పవన్ కళ్యాణ్ ని ప్రేమిస్తుంది. గత ఏడాది డిసెంబర్ లో పవన్ కళ్యాణ్-వాసంతి లకు నిశ్చితార్థం జరిగింది. 

మంగళవారం రాత్రి తిరుపతిలో పవన్ కళ్యాణ్-వాసంతి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వాసంతికి తిరుపతికి చెందిన అమ్మాయి కాగా అక్కడ వివాహం ఏర్పాటు చేశారు. వాసంతి వివాహానికి బంధు మిత్రులు, సన్నిహితులు, ప్రముఖులు హాజరయ్యారు. నూతన జంటను ఆశీర్వదించారు. పవన్ కళ్యాణ్ కూడా నటుడే. అతడు కొన్ని చిత్రాల్లో నటించినట్లు సమాచారం. 

ఇక వాసంతి పలు సీరియల్స్, సినిమాల్లో నటించింది. సిరి సిరి మువ్వలు సీరియల్ తో పరిశ్రమలో అడుగు పెట్టింది. గోరింటాకు, గుప్పెడంత మనసు వంటి పాప్యులర్ సీరియల్స్ ఆమె నటించారు. అలాగే సంపూర్ణేష్ బాబుకు జంటగా క్యాలీఫ్లవర్ మూవీ చేసింది. వాంటెడ్ పండుగాడు, భువన విజయం, సిఎస్ఐ సనాతన్, అడ్డతీగల చిత్రాల్లో ఆమె నటించారు. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @priyaaa14391

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios