ట్రాన్స్ జెండర్ ప్రియాంక అలియాస్ పింకీ పెళ్లి ప్రకటన చేసింది. త్వరలో నా వివాహం, అబ్బాయి వివరాలు చెబుతా అంటూ వీడియో ద్వారా తెలియజేశారు.
జబర్దస్త్ షోతో వెలుగులోకి వచ్చిన కమెడియన్స్ లో ప్రియాంక అలియాస్ పింకీ ఒకరు. ప్రియాంక ట్రాన్స్ జెండర్. ఆమె అసలు పేరు సాయి తేజ. జబర్దస్త్ షోలో లేడీ గెటప్స్ తో పాపులర్ అయ్యారు. అచ్చు అమ్మాయిలా ఉండే సాయి తేజ తన పేరు ప్రియాంకగా మార్చుకున్నాడు. ప్రియాంక బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొంది. అప్పుడు తాను సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారిన విషయం వెల్లడించింది. హౌస్లో నటుడు మానస్ కి మనసిచ్చింది. అతనంటే ప్రియాంక చాలా ప్రేమ చూపించేది.
స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ప్రియాంక అనేక వారాలు హౌస్లో ఉన్నారు. అందంగా తయారు కావడానికి ప్రియాంక బాగా ఇష్టపడేది. బిగ్ బాస్ షో అనంతరం ఆమె బుల్లితెర మీద బిజీ అయ్యారు. ప్రియాంక పలు షోల్లో సందడి చేస్తున్నారు. ఇటీవల స్టార్ మా లో మొదలైన డాన్స్ రియాలిటీ షో బీబీ జోడీలో సైతం ఆమె పార్టిసిపేట్ చేస్తున్నారు.
కాగా ప్రియాంక సడన్ గా నాకు పెళ్లంటూ షాక్ ఇచ్చింది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ మేరకు ప్రకటన చేసింది. గతంలో ప్రియాంక మెహందీ వేడుక ఫోటోలు కొన్ని వైరల్ అయ్యాయి. దీంతో ప్రియాంక వివాహం చేసుకోబుతున్నారనే ప్రచారం జరిగింది. ప్రియాంక నుండి ఎలాంటి ప్రకటన లేని పక్షంలో ఒక సందిగ్ధత నెలకొంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ స్పష్టత ఇస్తున్నట్లు ప్రియాంక వెల్లడించారు.
చాలా మంది మీకు పెళ్లి కుదిరిందా? అని అడుగుతున్నారు. వారి సందేహాలు తీర్చడానికి ఈ వీడియో చేశాను. అవును నేను పెళ్లి పెళ్లి చేసుకోబోతున్నాను. పేరెంట్స్ ఒప్పుకున్నాక, అంతా సెట్ అయ్యాక చెబుదామని ఆగాను. చెప్పాలంటే కొంచెం సిగ్గేస్తుంది. నా పెళ్లి ఎప్పుడు? వరుడు ఎవరు? ఆయన ఎలా ఉంటారు? వంటి విషయాలు ఈ వీడియో చివర్లో మీకు తెలియజేస్తాను. ప్రస్తుతం పెళ్లి కోసం నగల షాపింగ్ చేద్దాం... అని అన్నారు.
అనూహ్యంగా పూర్తి వీడియో చూశాక జస్ట్ ఫ్రాంక్ అంటూ మైండ్ బ్లాక్ చేశారు. కేవలం ఇది ఫ్రాంక్ వీడియో. నాకు పెళ్లి ఆలోచన ఉంది కానీ, దానికి ఇంకా సమయం కావాలంటూ ట్విస్ట్ ఇచ్చింది. ఆ వీడియో థంబ్ నెయిల్, మొదట్లో ఆమె చెప్పిన మాటలు విని నిజంగానే పెళ్ళని చాలా మంది కంగ్రాట్స్ చెబుతున్నారు. పూర్తి వీడియో చూసి ఫ్రాంక్ అని తెలిశాక... కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంకను తిట్టుకుంటున్నారు. జబర్దస్త్ వర్ష కూడా ఇలానే ఫ్రాంక్ వీడియో చేసి తిట్లు తింది. వ్యూస్ కోసం బుల్లితెర సెలెబ్రిటీలు ఇలా చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు.

