బిగ్ బాస్ ఫేమ్ శ్వేత వర్మ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం.. ప్రార్థన చేయండి అంటూ పోస్ట్!
బిగ్ బాస్ ఫేమ్ శ్వేత వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా స్వయంగా తెలియజేసింది.

శ్వేత వర్మ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక గది పూర్తిగా మంటల్లో కాలిపోయిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది. శ్వేత వర్మతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారట. ఇంస్టాగ్రామ్ లో ఈ ప్రమాద ఘటన గురించి ఆమె వివరించారు.
మా ఇంట్లో భయానక అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ ఇందుకు కారణమైంది. ఒక గది పూర్తిగా దగ్ధమైంది. మా కుటుంబ సభ్యులు, పెట్స్ సేఫ్ గా ఉన్నాము. అయితే ఈ షాక్ నుండి కోలుకునేందుకు సమయం పడుతుంది. మా కోసం ప్రార్థన చేయండి. మేమందరం భద్రంగా ఉన్నాము. మరలా సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని కలుస్తాను... అని శ్వేత వర్మ పోస్ట్ పెట్టారు.
శ్వేతకు ఎలాంటి హాని జరగకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. శ్వేత నటిగా కెరీర్ ప్రారంభించింది. కొన్ని చిత్రాల్లో నటించింది. బిగ్ బాస్ సీజన్ 5లో ఆమె పాల్గొన్నారు. శ్వేత వర్మ హౌస్లో ఎక్కువ కాలం ఉండలేదు. 6వ వారం ఆమె ఎలిమినేట్ అయ్యారు. ఈ సీజన్ విన్నర్ గా సన్నీ ఉన్నాడు. శ్వేతకి బిగ్ బాస్ షో కొంత ఫేమ్ తెచ్చిపెట్టింది.