తన సినిమాని చూడటం లేదని థియేటర్లో కన్నీళ్లు పెట్టుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్.. ట్రోలింగ్
బిగ్ బాస్ ఫేస్ సోహైల్ థియేటర్ లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన సినిమాని ఎవరూ చూడటం లేదని వాపోయాడు. దీనిపై నెటిజన్లు కూడా ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.
బిగ్ బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్నాడు సయ్యద్ సోహెల్ ర్యాన్. ఆయన నాల్గో సీజన్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సీజన్‌లో విన్నర్ అభిజిత్ కంటే సోహెల్‌కే ఎక్కువ పేరొచ్చింది. చిరంజీవి, నాగార్జున వంటి పెద్ద స్టార్లు ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఈ షోతో వచ్చిన క్రేజ్ కారణంగా సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. వరుసగా మూడు నాలుగు సినిమా ఆఫర్లు వచ్చాయి. ఒక్కోక్కటి రిలీజ్ అవుతూ వచ్చాయి.
మొదట `లక్కీ లక్ష్మణ్` మూవీ రిలీజ్ అయ్యింది కానీ పెద్దగా ఆడలేదు. దీంతో హైపర్ అయిపోయాడు. క్రిటిక్స్, నెగటివ్ కామెంట్లు చేసిన వారిపై విరుచుకుపడ్డాడు. దీంతో మరింత ట్రోల్‌కి గురయ్యాడు. ఆ తర్వాత `ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు` సినిమా చేశాడు. ఇది వచ్చిన విషయం తెలియకుండా వచ్చిపోయింది. ఆ మధ్య ప్రయోగాత్మక మూవీ `మిస్టర్ ప్రెగ్నెంట్` చేశాడు. ఈ మూవీ క్రిటిక్స్ ప్రశంసలందుకుంది. కానీ కమర్షియల్ గా ఆడలేదు.
ఇప్పుడు హిట్ కొట్టాలని `బూట్ కట్ బాలరాజు` సినిమా చేశాడు. ఇది ఏమాత్రం ప్రమోషన్స్ లేకుండా వచ్చింది. ఈ శుక్రవారం విడుదలైంది. సినిమా వచ్చిందనే విషయమే జనాలకు తెలియలేదు. అయితే సినిమాకి నెగటివ్ రియాక్షన్ వస్తుంది. ఆడియెన్స్ పట్టించుకోవడం లేదు. దీంతో సోహైల్ ఎమోషనల్ అయ్యాడు. థియేటర్లలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన సినిమాని ఎవరూ చూడటం లేదని వాపోయాడు.
ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ మూవీ అని, కానీ ఎవరూ ఎందుకు ఎంకరేజ్ చేయడం లేదని ప్రశ్నించాడు. బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలకు ఫ్యామిలీ చూసే సినిమాలు కావాలని పోస్ట్ లు పెడతారు, ఫ్యామిలీ ఎలిమెంట్లు లేవంటారు, మరి అందరు కలిసి చూసే సినిమాలు చేస్తే ఎందుకు చూడటం లేదని వాపోయాడు. థియేటర్ లోనే సోహైల్ గగ్గొలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన వీడియో వైరల్ అవుతుంది.
దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. సోహైల్ పరిస్ఙితిని చూసి కొంత మంది జాలి పడుతున్నారు. మరికొంత మంది ఇలాంటి గేమ్‌లే ఆపేయమని అంటున్నారు. సినిమాలో కంటెంట్ ఉన్న చిత్రాలు ఆడుతున్నాయని చెబుతున్నారు. మంచి కథని ఎంచుకుని, సినిమాని తీసి సరిగ్గా ప్రమోట్ చేస్తే ఎందుకు చూడరని అంటున్నారు. కంటెంట్ బాగలేక, ప్రమోషన్ చేయక, వీక్ పీఆర్ చేసి ఇలాంటి డ్రామాలెందుకు అంటున్నారు. ఇలాంటి సింపతి గేమ్‌లు ఇక్కడ వర్కౌట్ కావని అంటున్నారు.
వెంకటేష్(సైంధవ్), నాగార్జున(నా సామిరంగ) వంటి పెద్ద స్టార్ సినిమాలకు ఇక్కడ దిక్కులేదు. మీ సినిమాని ఎవరు చూస్తారని కామెంట్లు పెడుతున్నారు. మంచి కంటెంట్‌తో సినిమా చేయాలని సలహాలిస్తున్నారు. అవి వదిలేసి ఇలాంటి గేమ్‌లు ఎన్ని ఆడినా ప్రయోజనం లేదంటున్నారు.
Read more: `సలార్ 2` షూటింగ్ కి తొందరపడుతున్న ప్రశాంత్ నీల్.. కారణం ఏంటంటే?
Also read: `పుష్ప2`లో ఇంటర్నేషనల్ విలన్.. జపాన్‌లో షూటింగ్,.. వామ్మో కథ పెద్దదే?