MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • `పుష్ప2`లో ఇంటర్నేషనల్‌ విలన్‌.. జపాన్‌లో షూటింగ్‌,.. వామ్మో కథ పెద్దదే?

`పుష్ప2`లో ఇంటర్నేషనల్‌ విలన్‌.. జపాన్‌లో షూటింగ్‌,.. వామ్మో కథ పెద్దదే?

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ నటిస్తున్న `పుష్ప2` విషయంలో సరికొత్త వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో దర్శకుడు సుకుమార్‌ సరికొత్త మార్పులు చేస్తున్నారట.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Feb 03 2024, 12:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో ఇప్పుడు `పుష్ప 2` మూవీ రూపొందుతుంది. మూడేళ్ల క్రితం వచ్చిన `పుష్ప`కి ఇది రెండో పార్ట్. మూడేళ్లుగా ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. మొదటి భాగం పెద్ద విజయం సాధించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో సినిమా రేంజ్‌ కూడా పెరిగింది. దీంతో భారీ స్కేల్‌లో ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో తెరకెక్కిస్తున్నారు సుకుమార్.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

క్వాలిటీ పరంగానూ సినిమాని పెంచేస్తున్నారు. భారీ అంచనాలున్న నేపథ్యంలో సినిమా లావిష్‌గా, మరింత లార్జ్ స్కేల్‌లో రూపొందిస్తున్నారు. అదే సమయంలో కంటెంట్‌ పరంగానూ రాజీ పడటం లేదు. ఏమాత్రం అసంతృప్తిగా ఉన్న కూడా రీ షూట్‌ చేస్తున్నారట సుకుమార్‌. క్వాలిటీ విషయంలో రాజీ పడటం లేదు. అందుకే షూటింగ్‌ ఆలస్యమవుతుందని అంటున్నారు. 

36

ఇదిలా ఉంటే `పుష్ప 2` షూటింగ్‌ జపాన్‌లో ఉండబోతుందట. నెక్ట్స్ షెడ్యూల్‌ని జపాన్‌లో చిత్రీకరించబోతున్నారట. కథ రేంజ్‌ని పెంచే క్రమంలో, పుష్ప బిజినెస్ అంతర్జాతీయంగా నడిపించాడనే విషయాన్ని తెలిపే క్రమంలో జపాన్‌లో కొన్ని కీలక సన్నివేశాలను, అలాగే యాక్షన్‌ సీన్లని చిత్రీకరించబోతున్నారట. పుష్ప అంతర్జాతీయంగానూ ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఎలా చక్రం తిప్పారనేది ఇందులో చూపించబోతున్నట్టు తెలుస్తుంది.

46

అంతేకాదు ఇందులో మరో విలన్‌ ని పరిచయం చేయబోతున్నారట. అంతర్జాతీయ విలన్ ని కూడా ఇందులో చూపించే అవకాశం ఉందని అంటున్నారు. అందుకోసం ఓ ఇంటర్నేషన్‌ యాక్టర్‌ని తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఫహద్‌ ఫాజిల్‌ని ఓ విలన్‌గా చూపించబోతున్నారు. ఇప్పుడు అంతర్జాతీయంగానూ మరో విలన్‌ని పరిచయం చేయబోతున్నారట. దీంతో ఇది మరో పార్ట్ లింక్‌ ఉంటుందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

56

ఇదిలా ఉంటే `పుష్ప` సినిమా ప్రారంభంలోనే ఎర్రచందనం స్మిగ్లింగ్‌ ప్రధానంగా జపాన్‌, చైనాలో జరుగుతుందని చెప్పారు. ఆ లింక్‌ బేస్డ్ గా ఇప్పుడు స్క్రిప్ట్ లో సరికొత్త మార్పులు చేసి, సినిమా స్కేల్‌ని పెంచే ప్రయత్నం చేస్తున్నారట దర్శకుడు సుకుమార్‌. `పుష్ప2`ని ఇంటర్నేషనల్‌ మూవీగా ప్రజెంట్‌ చేసే ప్రయత్నం జరుగుతుందట. మన భారతీయ సినిమాలకు `జపాన్‌`లో మంచి క్రేజ్‌ ఉంది. బాగా ఆడుతాయి. `పుష్ప` కూడా అక్కడ బాగా ఆడింది. దీంతో సరికొత్త స్ట్రాటజీని మెయింటేన్‌ చేస్తున్నారట. మరి ఇది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి. 

66

ఇక సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న `పుష్ప2` సినిమాలో బన్నీకి జోడీగా నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఫహద్‌ పాజిల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ భన్వర్‌ సింగ్‌ షేకావత్‌గా కనిపిస్తారు. ఆయన పాత్ర నెగటివ్‌గా సాగబోతుంది. మరోవైపు సునీల్‌, అనసూయ, రావు రమేష్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్ ఈ చిత్రం రూపొందుతుంది. ఆగస్ట్ 15న ఈ మూవీని విడుదల చేయబోతున్నారట. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sivaji Remuneration: మరోసారి బిగ్‌ బాస్‌ కి యాంకర్‌గా శివాజీ.. ఊహించని రెమ్యూనరేషన్‌
Recommended image2
G2 Movie: రిలీజ్ డేట్ రాలేదు, అయినా గూఢచారి 2 ఫస్ట్ రివ్యూ ఇదిగో..స్పై థ్రిల్లర్స్ లో ఎపిక్ బ్లాక్ బస్టర్
Recommended image3
Chiranjeevi: ఇండస్ట్రీ హిట్ కొట్టాల్సిన చిరంజీవి మూవీ, 10 రోజుల తర్వాత కొలాప్స్.. కారణం ఎవరో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved