బిగ్ బాస్ ద్వారా భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు సోహెల్. సీజన్ 4 టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచిన ఆయన రెమ్యూనరేషన్ పరంగా కూడా బాగానే అందుకున్నారు.  టైటిల్ రేసులో నాగార్జున ఆఫర్ చేసిన డబ్బులు తీసుకొని సోహెల్ మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు. మొత్తంగా బిగ్ బాస్ షో వలన సోహెల్ రూ. 50 లక్షల రూపాయలకు పైనే అందుకున్నాడని సమాచారం. ఇక హౌస్ నుండి బయటికి వచ్చిన వారం వ్యవధిలోనే కొత్త మూవీ ప్రకటనచేశాడు సోహెల్. 

నూతన దర్శకుడు శ్రీనివాస్ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని జార్జిరెడ్డి మూవీ నిర్మాత నిర్మించడం విశేషం. 2021 జనవరి నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే అలాగే మరికొందరు దర్శకుల నుండి సోహెల్ కి ఆఫర్స్ వస్తున్నాయట. దర్శక నిర్మాతల నుండి వస్తున్న ఆఫర్స్ లో ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నాడని సమాచారం. 

కాగా నేడు ఓ సామజిక బాధ్యత నెరవేర్చిన సోహెల్.. తన అభిమానులకు స్ఫూర్తిగా నిలిచారు. సోహెల్ రక్త దానం చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంకు ... చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కి వెళ్లి సోహెల్ రక్త దానం చేయడం జరిగింది. సోహెల్ రక్తదానం చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవచ్చనే సందేశాన్ని సోహెల్ అందరికీ అందించారు. సోహెల్ చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి.