Asianet News TeluguAsianet News Telugu

Jabardasth Faima : హాస్పిటల్ బెడ్ పై జబర్ధస్త్ ఫైమా.. ఆందోళణలో అభిమానులు, ఆమెకు ఏమయ్యింది..?

ఈమధ్య బుల్లితెర స్టార్స్ చాలా మంది హాస్పిటలైజ్ అవ్వడం.. ఎక్కువగా జరుగుతుంది. తాజాగా బిగ్ బాస్ ఫేమ్.. జబర్థస్త్ ఫైమా కూడా హాస్పిటల్ బెడ్ పై ఉండటం ఆమె అభిమానులను కలవరపెడుతోంది. ఇంతకీ ఫైమాకు ఏమయ్యింది. 
 

Bigg Boss Fame Jabardasth Faima Hospitalised Viral News JMS
Author
First Published Nov 26, 2023, 7:18 AM IST

జబర్ధస్త్  ఫైమా... ఈ పేరు వింటేనే వెంటనే ముఖంలో నవ్వు కనిపిస్తుంది ఆడియన్స్ కి. ఎందుకుంటే ఆమె పెర్ఫామెన్స్ అలా ఉంటుందిమరి. మరీముఖ్యంగా ఫైమా ఫెస్ ఎక్స్ ప్రెషన్స్..బాడీ లాంగ్వేజ్.. ఎంత నవ్వకుండా కూర్చుక్నవారినికూడా వెంటనేనవ్విస్తుంది. అంత‌లా గుర్తింపు తెచ్చుకున్న ఫైమాకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

ఆ వీడియో చూసిన నెటీజ‌న్లు చాలా కంగారు ప‌డుతున్నారు. ఈ వీడియోలో ఆమె ఆస్ప‌త్రిలోని బెడ్ పై ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. ఆమెకు ఏమైంద‌ని నెటీజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్ లో ఫైమా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె హాస్పిటల్ బెడ్ పై.. హాస్పిటల్ డ్రెస్ లో కనిపించింది. అంతే కాదు  చేతికి సెలైన్‌ కూడా ఉంది. నా గతమంతా నే మరిచానే అనే పాటను ఈ వీడియోకి జోడించి పోస్ట్ చేసింది ఫైమా. 

కాని అసలుతనకు ఏమయ్యింది. అన్న విషయం కూడా చెప్పలేదు. అసలు నిజంగా ఫైమా హాస్పిటలైజ్ అయ్యిందా..? లేక ఇది ఏదైనా షూటింగ్ లో భాగమా అని  నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నార. అంతే కాదు..ఈపోస్ట్ లో ఆమె అసలునిజం చెపితే బాగుండేది అటున్నారు. ఒక వేళ షూటింగ్ లో భాగం అయితే.. తనఫ్యాన్స్ ను ఇలా హార్ట్ చేయడం కరెక్ట్ కాదు. అయితే.. త‌న‌కు ఏం జ‌రిగింద‌నే విష‌యాన్ని చెపితే బాగుండేది అన్నఅభిప్రాయం వ్యాక్తం అవుతోంది. ఇక ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా.. ఏం జ‌రిగింద‌ని నెటీజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. మీరు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మ‌రికొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మ‌రీ ఫైమా స్పందిస్తుందో లేదో.

పేద కుటుంబం నుంచి వచ్చి కమెడియన్ గా బుల్లితెరపై ఎదిగింది ఫైమా. పటాస్  షోకు ఆడియెన్‌గా వెళ్లి కంటెస్టెంట్ అయ్యింది. త‌నదైన పంచ్‌ల‌ు, హావభావాలతో నవ్విస్తుంది ఫైమా.. ఇక పటాస్నుంచి క్ర‌మంగా ఆమె ప్ర‌యాణం జ‌బ‌ర్ధ‌స్త్ వైపు అడుగులు వేసింది. ఇక జ‌బ‌ర్ధ‌స్త్‌లో అయితే త‌నదైన మేన‌రిజ‌మ్‌, టైమింగ్‌తో పాటు డ్యాన్స్‌తోనూ అల‌రించింది. ఈ క్ర‌మంలో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో గ‌త సీజ‌న్‌లో బిగ్‌బాస్‌లో పాల్గొనే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది.

బిగ్ బాస్ సీజన్6 లో ఎంటర్టైర్మెంట్ అంతా ఫైమాదే.   10 వారాల పాటు హౌస్‌లో ఉంది ఫైమా. ఎంతో పేదరికం చూసిన తమకు.. మంచిఇల్లు నిర్మించుకోవడం టార్టెగ్ అంటూ చెప్పకోచ్చింది.  బీడీ కార్మికురాలిగా.. తన తల్లికివచ్చేతక్కువ డబ్బుతో  ఫ్యామిలీని పెంచి పోషించిందని. అందుకే అమ్మకు మంచి ఇల్లు కట్టి ఇవ్వాలనేది తన కోరిక అన్నది.  అన్నట్టుగానే బయటకు వచ్చిన తరువాత తన సోంత ఊరిలో.. మంచి ఇల్లు కట్టించి తన తల్లిక గిఫ్ట్ గా ఇచ్చింది ఫైమా. అంతే కాదు సొంత యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్న ఫైమా.. గృహ ప్రవేశాన్నియూట్యూబ్ ఛానెల్లో  కూడా పోస్ట్ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios