బిగ్ బాస్ షోలో పాల్గొనడం కోసం జబర్ధస్త్ నుండి బయటికి వచ్చేశాడు అవినాష్. అగ్రిమెంట్ బ్రేక్ చేసిన అవినాష్ నుండి జబర్ధస్త్ నిర్వాహకులు రూ. 10లక్షలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక బిగ్ బాస్ షో ద్వారా తనకు బాగానే డబ్బులు వచ్చాయని, నా సమస్యలు తీరతాయని ముక్కు అవినాష్ వెల్లడించడం జరిగింది. 13వ వారం హౌస్ నుండి ఎలిమినేటై బయటికి వచ్చిన అవినాష్... స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నారు. ఫైనల్ కి ఖచ్చితంగా వెళతాడనుకున్న అవినాష్ టైటిల్ ఫేవరెట్స్ లో ఒకరిగా ఉన్నారు. 

కమెడియన్ మార్క్ తో హౌస్ లోకి ప్రవేశించిన అవినాష్ తన పేరు నిలబెట్టుకున్నాడు. తన మార్క్ కామెడీతో అవినాష్ ఇంటి సభ్యులతో పాటు, ప్రేక్షకులకు నవ్వులు పంచారు. హోస్ట్ నాగార్జున సైతం అవినాష్ కామెడీ ఎంతగానో ఇష్టపడేవారు. బిగ్ బాస్ షో ద్వారా అవినాష్ ఫేమ్ రెట్టింపు అయ్యింది. ఇది వరకు జబర్ధస్త్ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన అవినాష్.. ఇప్పుడు అందరికీ పరిచయం అయ్యాడు. 

ఈ నేపథ్యంలో నవ్వుల బాబు నాగబాబు అవినాష్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడంట. జీ తెలుగులో ప్రసారం అవుతున్న బొమ్మ అదిరింది షో కోసం అవినాష్ ని తీసుకొనే ఆలోచన చేస్తున్నారట. పారితోషికం విషయంలో కూడా భారీగానే ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా నాగబాబు, అవినాష్ కి సప్పోర్ట్ చేశారు. అవినాష్ గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. జబర్ధస్త్ నుండి బయటికి వచ్చిన ప్రతిఒక్కరికి నాగబాబు తన షోలో అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.