Asianet News TeluguAsianet News Telugu

అఫ్ఘనిస్థాన్ క్రికెటర్ తో పెళ్లి క్యాన్సిల్ చేసుకునే ఆలోచనలో బిగ్ బాస్ భామ

అర్షి ఖాన్ మాట్లాడుతూ అఫ్ఘనిస్థాన్ క్రికెటర్ ఒకరితో పెళ్లి నిశ్చయం అయ్యింది. అతనితో నాకు ఎంగేజ్మెంట్ జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మా పేరెంట్స్ ఈ పెళ్లిని రద్దు చేసే అవకాశం కలదు.. అన్నారు.

bigg boss fame arshi khan wants to called off her marriage with afghan cricketer
Author
Hyderabad, First Published Aug 23, 2021, 3:28 PM IST

అఫ్ఘనిస్థాన్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. అధ్యక్షుడు దేశం వదిలిపారిపోగా, తాలిబన్స్ రాజ్యాధికారం చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాలిబన్స్ ఆక్రమణతో అఫ్ఘనిస్థాన్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వేల సంఖ్యలో ప్రజలు దేశం వదిలిపారిపోతుండగా, ఇంకా అనేక మంది కాబుల్ ఎయిర్ పోర్ట్ వద్ద దేశం దాటించాలని వేడుకుంటున్నారు. అఫ్ఘనిస్థాన్ లో భయానక పరిస్థితులు నెలకొన్న తరుణంలో నటి అర్షి ఖాన్ ఆ దేశ క్రికెటర్ తో పెళ్లి రద్దు చేసుకునే ఆలోచనలు ఉన్నట్లు తెలియజేశారు. 


నటి అర్షి ఖాన్ మాట్లాడుతూ అఫ్ఘనిస్థాన్ క్రికెటర్ ఒకరితో పెళ్లి నిశ్చయం అయ్యింది. అతనితో నాకు ఎంగేజ్మెంట్ జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మా పేరెంట్స్ ఈ పెళ్లిని రద్దు చేసే అవకాశం కలదు.. అన్నారు. అఫ్ఘనిస్థాన్ క్రికెటర్ తండ్రి మా నాన్నకు మిత్రుడు, దీనితో అతనితో నాకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. అఫ్ఘనిస్థాన్ లో తాలిబన్స్ మారణహోమం సాగిస్తుండగా, కుటుంబ సభ్యులు ఈ పెళ్లి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అర్షి ఖాన్ తెలిపారు. 


ఇక  అఫ్ఘనిస్థాన్ మూలాలు కలిగిన అర్షి ఖాన్ కుటుంబం చాలా కాలం క్రితం ఇండియాకు వలస రావడం జరిగింది. అందుకే అఫ్ఘనిస్థాన్ కి చెందిన అబ్బాయిని అల్లుడిగా తెచ్చుకోవాలన్న అర్షి ఖాన్ కుటుంబం ఆశలపై నేటి దుర్భర పరిస్థితులు నీళ్లు చల్లాయి. సదరు క్రికెటర్ తో సంబంధం క్యాన్సిల్ చేసుకోవడంతో పాటు, ఇండియనే తనకు భర్తగా వచ్చే అవకాశం కలదని అర్షి తెలియజేశారు. ఇక బిగ్ బాస్ 11లో పాల్గొన్న అర్షి, సీజన్ 14లో ఛాలెంజర్ గా ఎంట్రీ ఇచ్చారు. పలు టెలివిజన్ షోలు, సీరియల్స్ లో ఆమె సందడి చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios