Asianet News TeluguAsianet News Telugu

ఆడపిల్లకు జన్మనిచ్చిన బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి భార్య, పేరు ఏం పెట్టాడంటే..?

బుల్లితెర ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పాడు బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నసమయం రానే వచ్చిదంటూ.. శుభవార్తను నెటిజన్లతో పంచుకున్నాడు అర్జున్. 
 

Bigg Boss Fame Arjun Ambati Wife Delivery Baby Girl JmS
Author
First Published Jan 9, 2024, 6:06 PM IST

బుల్లితెరపై బిజీ బిజీగా ఉన్నాడు స్టార్ సీరియల్ నటుడు అర్జున్ అంబటి. సినిమాల్లో రాణించాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. సీరియల్ హీరోగా కెరీర్ ను కంటీన్యూ చేస్తున్నాడు అర్జున్ అంబటి. అగ్నిసాక్షి, దేవత లాంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించిన అర్జున్.. రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్ట్ ఎంట్రీ ద్వారా సందడిచేశాడు. 

అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి.. చివరి వరకూ ఉన్న కంటెస్టెంట్  అర్జున్ ఒక్కడే. అంతే కాదు ఆట తీరుతో మెప్పించి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలవడంతో పాటు.. మొదటి టాప్ 5 ఫైనలిస్ట్ గా కూడా అర్జున్ నిలిచాడు. ఒక వేళ వైల్డ్ కార్డ్ ద్వారాకాకుండా.. ముందు నుంచే హౌస్ లో ఉండి ఉంటే.. అర్జున్ విన్నర్ అయ్యేవాడు అనేది ఆడియన్స్ అభిప్రాయం. 


ఇక అర్జున్ బిగ్ బాస్ లో ఉండగా... అతని భార్య హౌస్ లోకి రావడం.. ఆమె ప్రగ్నెంట్ అని తెలియడంతో .. అందులోసే సీమంతం చేయడం కూడా తెలిసిందే. అయితే తాజాగా అర్జున్ అంబటి భార్య పండంటి ఆడపిల్లకు  జన్మించింది. ఈ విషయాన్ని స్వయంగా.. అర్జున్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఇలా తనకు కూతురు పుట్టిందనే విషయాన్ని మాత్రమే కాకుండా తన కుమార్తె పేరును కూడా ఈయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. 

అర్జున్ తన కూతురుకు అర్క అనే పేరు పెడుతున్నట్లు తెలిపారు. పాప పుడితే ఈ పేరు పెడతానని ముందుగానే అర్జున్ అంబటి వెల్లడించారు. వెల్లడించారు. చెప్పిన విధంగానే తనకు పాప పుట్టడంతో ఈ పేరు పెడతామన్నారు. అయితే అసలు ఈపేరు ఎందుకు పెట్లాలి అనుకున్నారంటే..తన పేరులోఅంటే ల అర్జున్ లో Ar తన భార్య సురేఖ పేరు నుంచి kha కలిపి తన కుమార్తెకు Arkha అనే పేరును పెడుతున్నట్టు చెప్పారు. 

ఇక అర్జున్ తండ్రి అయ్యాడిన వెల్లడించడం.. పేరు కూడా వెల్లడించడంతో.. అభిమానులు, స్నేహితులు. ఇండస్ట్రీ నుంచి ఆయనకు  శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.  అయితే ఈ గుడ్ న్యూస్ వెల్లడించిన జంట.. తమ కూతురు ఫోటోను మాత్రం చూపించలేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios