Asianet News TeluguAsianet News Telugu

దొంగతనం చేస్తూ దొరికి పోయిన అరియనా... వీడియో వైరల్!

అరియనా దొంగతనం చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆమె బిగ్ బాస్ కంటెస్టెంట్ జెస్సి తో పాటు కారులో వెళుతుంది. నాగ శివారులో పాల కూర తోట కనిపించింది. ఆ పాల కూర దొంగతనం చేసింది. ఈ వీడియో వైరల్ గా మారింది. 
 

bigg boss fame ariyana glory theft  video getting viral ksr
Author
First Published Apr 7, 2024, 7:33 PM IST


అరియనా గ్లోరీ సోషల్ మీడియా జనాలకు పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ వేదికగా అమ్మడు పిచ్చ పాప్యులర్ అయ్యింది. అరియనా బిగ్ బాస్ సీజన్ 4 లో పార్టిసిపేట్ చేసింది. బిగ్ బాస్ సీజన్ 4 ఫైనలిస్ట్స్ లో అరియనా ఒకరు. అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అరియనాకు 4వ స్థానం దక్కింది. హౌస్లో అరియనా స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించుకుంది. ముక్కుసూటి తత్త్వం, హానెస్ట్ గేమ్ తో ఆకట్టుకుంది. బిగ్ బాస్ అనంతరం ఆమెకు బుల్లితెర మీద ఆఫర్స్ పెరిగాయి. 

బీబీ జోడీలో సందడి చేసింది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ తో డాన్స్ రియాలిటీ షో జరిగింది. హీరోయిన్ సదా, నటి రాధ, తరుణ్ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరించారు. అవినాష్ తో జతకట్టిన అరియనా ఫైనల్ కి వెళ్లడం విశేషం. బీబీ జోడి ఫైనల్ లో ఫైమా-ఆర్జే సూర్య జోడీ చేతిలో ఓడిపోయారు. బీబీ జోడీ ప్రైజ్ మనీ రూ. 25 లక్షలు ఫైమా-ఆర్జే సూర్య సొంతం చేసుకున్నారు. అరియనా-అవినాష్ పెర్ఫార్మన్స్ కి ప్రశంసలు దక్కాయి. 


కాగా ఆ మధ్య అరియనా గ్లోరి దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది. జిమ్ ఫిట్ లో అరియనా సూపర్ హాట్ గా దర్శనం ఇచ్చింది. వర్మ ఆమె షేప్స్, ప్రైవేట్ పార్ట్స్ గురించి అడుగుతుంటే నిస్సంకోచంగా సమాధానాలు చెప్పింది. ఈ ఇంటర్వ్యూ వైరల్ అయ్యింది. అలాగే తరచుగా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తుంది. కొంచెం ఒళ్ళు చేసిన అరియనా మరింత హాట్ గా తయారైంది. అయితే కొందరు ఆమెను లావు అయ్యావని విమరిస్తున్నారు. వాళ్లకు అరియనా కౌంటర్ ఇచ్చింది. 

సన్నగా ఉంటే మరీ బక్కగా ఉన్నావని అంటారు. కొంచెం లావైతే షేప్ అవుట్ అవుతున్నా అంటారు. అసలు నేను ఎలా ఉంటే మీకేంటి. నా ఒళ్ళు నా ఇష్టం. పనీ పాట లేని వాళ్ళు నన్ను విమర్శించడమే పనిగా పెట్టుకుంటున్నారు.. అని అరియనామండి పడింది. ఇదిలా ఉంటే... అరియనా దొంగతనం చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆమె బిగ్ బాస్ కంటెస్టెంట్ జెస్సి తో పాటు కారులో వెళుతుంది. నాగ శివారులో పాల కూర తోట కనిపించింది. ఆ పాల కూర దొంగతనం చేసింది. ఈ వీడియో వైరల్ గా మారింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios