Asianet News TeluguAsianet News Telugu

హీరోగా బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ సినిమా, హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..?

బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ లక్కీఛాన్స్ కొట్టేశాడు.. ఇప్పికేబుల్లితెరపై హీరోగా ఉన్న అమర్.. ఇక వెండితెర హీరోగా సందడి చేయబోతున్నాడు. 

Bigg Boss Fame Amardeep Movie With Surekha Vani Daughter Supritha JmS
Author
First Published Feb 1, 2024, 7:04 AM IST | Last Updated Feb 1, 2024, 7:08 AM IST


బిగ్ బాస్ ఫేం అమర్ దీప్ గురించి ప్రత్యేయంచా చెప్పాల్సిన పనిలేదు. అతను బిగ్ బాస్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.  ఈసారి బిగ్ బాస్ లో అమర్ దీప్ కు కప్పు గ్యారెంటీ అనుకున్నారంతా..? కాని పల్లవి ప్రశాంత్ గట్టిపోటీ ఇచ్చి కప్పుగెలుచుకుపోయా. గత సీజన్లలో లేని విధంగా ఎక్కువ గొడవలు.. దాడుల వ్వవహారంతో బిగ్ బాస్ హౌస్అంతా రచ్చ రచ్చగ తయారయ్యింది. ఇక పోతే.. బిగ్ బాస్ నుంచి వచ్చాక ఎవరి కెరీర్ పై వారు దృష్టి పెట్టారు. 

ఇక అందులో హీరోలుగా మూరుతూ వస్తున్నారు కొంత మంది బుల్లితెర తారలు. అందుల్ సందీప్ మాస్టర్ హీరోగా ఇప్పటికేసినిమా అనౌస్స్ అవ్వగా.. తాజాగా బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ హీరోగా కొత్త సినిమాను ప్రకటించారు. ఇప్పటికే బుల్లితెరపై హీరోగా పలు సీరియల్స్ చేసిన అమర్ దీప్ ఇక వెండి తెరపై హీరోగా  సందడి చేయబోతున్నాడు. ఇక హీరోయిన్ ఎవరంటే.. స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్  సురేఖా వాణి కూతురు సుప్రీత ఈసినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది. 

Bigg Boss Fame Amardeep Movie With Surekha Vani Daughter Supritha JmS

సుప్రీత కూడా సోషల్ మీడియా స్టార్ గా ఎదిగింది. సురేఖా వాణితో కలిసి ఆమె చేసే వీడియోలకు మంచి ఫాలోయింగ్ ఉంది. తల్లీ కూతురు ఇద్దరుహాట్ హాట్ డ్రస్ లతో.. ఇన్ స్టా రీల్స్.. స్పెషల్ ఫోటోస్ తో బాగా పాపులర్ అయిపోయారు. ఇక ఈసినిమాతో సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. 

ఈ సినిమా ఓపెనింగ్ తో పాటు " ప్రొడక్షన్ నం.2 " పూజ కార్యక్రమం రేపు  అనగా 1 ఫిబ్రవరి  ఉదయం 10 గంటలకి ప్రసాద్ ల్యాబ్ , హైదరాబాద్ నందు జరుగుతుంది అని ప్రకటించారు. ఇక ఈసినిమా  M3 మీడియా బ్యానర్లో, మహేంద్ర నాథ్ కొండ్ల నిర్మాణంలో తెరకెక్కుతుతుంది.ఈ విధంగా ఓ ప్రకటన రిలీజ్ చేశారు టీమ్. ఇక ఈసినిమాలో వీరితో పాటు సీనియర్ హీరో వినోద్ కుమార్, రాజా రవింద్ర లాంటి సీనియర్ యాక్టర్స్ నటించబోతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios