సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందేనని చాలా మంది తారలు కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది కామన్ గా మారిపోయిందని.. అది ఏ స్థాయిలో ఉంటుందో కూడా వివరించిన చెప్పినవారు ఉన్నారు. అయితే ఇది సినీపరిశ్రమకు మాత్రమే పరిమితం కాదు.. టీవీ రంగంలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందనే మాటలు 
వినిపించేవి. నార్త్ లో జరిగిన కొన్ని సంఘటనలు ఈ విషయాలను రుజువు చేశాయి.

కానీ సౌత్ లో ఇలాంటి ఘటనలు బయటపడిన సందర్భాలు చాలా తక్కువ. అయితే సీరియల్స్ లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని చెబుతోంది బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టంట్ రోహిణి. బిగ్ బాస్ హౌస్ నుండి గతవారం ఎలిమినేట్ అయిన రోహిణి పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. ఈ క్రమంలో కెరీర్ ఆరంభంలో తను ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలని వెల్లడించింది.

బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ కి వచ్చిన రోహిణి.. ఆ తరువాత ఇండస్ట్రీకి షిఫ్ట్ అయినట్లు చెప్పింది. ఓ సీరియల్ ఆడిషన్ కోసం నిర్మాతలను వెళ్లి కలిసినప్పుడు ఏకంగా తనను ఇద్దరు కమిట్మెంట్ అడిగినట్లు చెప్పింది. దీంతో అక్కడ నుండి వచ్చేశానని.. ఆ తరువాత మరో ఆడిషన్ లో కూడా ఇదే అనుభవం ఎదురైందని.. వయసులో చాలా పెద్ద వ్యక్తి తనను ఇబ్బంది పెట్టాడని.. అవకాశం ఇస్తా.. నాకేం ఇస్తావ్ అంటూ డైరెక్ట్ గా అడిగేవాడు అంటూ చెప్పుకొచ్చింది.

ఇలాంటి ఎన్నో అనుభవాల నుండి బయటపడి.. నలుగురు మెచ్చుకునే స్థాయికి చేరుకున్నానని చెబుతోంది రోహిణి. కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతీ రంగంలో ఉంటుందని.. కానీ గ్లామర్ ఫీల్డ్ లో ఇది కాస్త ఎక్కువ ఉందని వెల్లడించింది.