బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ పాపులారిటీ పదింతలు పెరిగింది. హీరోగా కొన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు అభిజీత్ బిగ్ బాస్ ద్వారా రాబట్టాడు. టైటిల్ పోరులో అఖిల్ తో పోటీపడిన అభిజీత్ అత్యధిక ఓట్లు సంపాదించి విన్నర్ అయ్యారు. విన్నర్ గా అభిజీత్ రూ. 25 లక్షలు ప్రైజ్ మనీ, బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్నాడు. కాగా అభిజీత్ కి టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తున్నట్లు వార్తలు వస్తుండగా... ఓ క్రేజీ చక్కర్లు కొడుతుంది. 

దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్ 3 చిత్రాన్నితెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 2019లో విడుదలైన ఎఫ్ 2కి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. మొదటి పార్ట్ లో నటించిన వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా మరియు మెహ్రిన్ ఫిర్జాడా నటిస్తున్నారు. ఇటీవల గ్రాండ్ గా మొదలైన ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైపోయింది. దిల్ రాజు ఎఫ్ 3 నిర్మాతగా ఉన్నారు. 

కాగా ఎఫ్ 3 మూవీలో అభిజీత్ ఓ కీలక రోల్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కథలో కీలకమైన ఓ పాత్ర కోసం అభిజీత్ ని తీసుకునే ఆలోచనలో దర్శకుడు అనిల్ రావిపూడి ఉన్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని ప్రచారం జరుగుతుంది. మరి ఇదే కనుక నిజం అయితే అభిజీత్ కి మంచి బ్రేక్ దొరికినట్లే.