Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 రోజురోజుకీ ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో రీతూ చౌదరి ఫుల్ హైలైట్ అయ్యింది. కళ్యాణ్‌కి ఫ్లర్ట్ చేస్తూ డైలాగులు చెప్పిన ఆమె, కొద్దిసేపటికి డీమాన్ పవన్‌కి గోరుముద్దలు తినిపించింది.
Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతోంది. ఎప్పటిలాగే గొడవలు, వ్యూహాలు మాత్రమే కాకుండా ఈసారి కాస్త రొమాన్స్ కూడా కనిపిస్తుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో కంటెస్టెంట్ల మధ్య ట్రయాంగిల్ లవ్ ట్రాక్ హైలెట్ గా మారింది. తాజా ప్రోమోలో రీతూ చౌదరి, పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్ మధ్య సాగిన సంభాషణలు, ఎమోషన్స్ ప్రత్యేకంగా చూపించారు.
ఒకవైపు రీతూ పవన్ కళ్యాణ్‌తో సన్నిహితంగా మాట్లాడగా, మరోవైపు డీమాన్ పవన్‌తో సరదాగా ముచ్చటించడం ప్రోమోలో హైలైట్ అయ్యింది. వీటిని “బద్మాష్ పోరి రాధిక” బ్యాక్‌గ్రౌండ్ సాంగ్‌తో కట్ చేసిన ఎడిటింగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వాస్తవానికి మొదటిరోజే రీతూ చౌదరి.. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసింది. అతని కళ్ళలో తీక్షణంగా చూసి, తానే ఆగమైంది. ఈ మూమెంట్ కేవలం 2 నిమిషాలే అయినా.. ఆ టాస్క్ ఇన్పాక్ట్ ఇంకా ఉంది. ఆ వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఇక తాజా ప్రోమోలో కళ్యాణ్‌ను చూస్తూ ఫ్లర్ట్ చేయడం మొదలుపెట్టింది. రీతూ ఫ్లర్ట్‌లపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో రియాక్షన్ ఇచ్చాడు. రీతూ కళ్ళలోని గమనిస్తూ, హౌస్‌లోని మోమెంట్స్‌ను ఫ్రెండ్లీ & ఎమోషనల్‌గా ఫీల్ చేసాడు. కొద్దిసేపటి తర్వాత రీతూ చౌదరి డీమాన్ పవన్‌కి గోరుముద్దలు తినిపించింది.
ఒకే ప్రోమోలో రెండు వేరియేషన్స్ (కళ్యాణ్ & డీమాన్ పవన్) చూపిస్తూ, ట్రైయాంగిల్ లవ్ స్టోరీకి కాస్త కలర్ జోడించాడు బిగ్ బాస్. ప్రోమో విడుదలైన తర్వాత, సోషల్ మీడియాలో కామెంట్స్‌లో కంటెస్టెంట్లు కరువులో ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే.. ప్రోమో ఫీల్ గుడ్ మ్యూజిక్‌తో ప్రారంభమైన రాధిక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ప్రోమో ముగిసింది. రాధిక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తో ఈవీడ రీతూ కాదు, రాధిక అని క్లారిటీ వచ్చింది.
చివర్లో ట్విస్ట్
ప్రోమో చివర్లో డీమాన్–రీతూ కలిసి మాట్లాడుతుండగా, పవన్ కళ్యాణ్ సీరియస్‌గా వారిని గమనించడం మరింత సస్పెన్స్ క్రియేట్ చేసింది. దీనితో సీజన్-4లో మోనాల్–అభిజిత్–అఖిల్ మధ్య నడిచిన ట్రయాంగిల్ లవ్ ట్రాక్‌లాగే, ఈసారి కూడా బిగ్‌బాస్ హౌస్‌లో అలాంటి కథనం నడుస్తుందా అనే ఆసక్తి పెరిగింది. ప్రేక్షకులు ఇప్పటికే ఈ ట్రాక్‌పై సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నారు. మరి ఈ లవ్ డ్రామా ఎంతవరకు సాగుతుందో చూడాలి. కంటెస్టెంట్ల మధ్య జరిగే ఈ గుసగుసలు, రొమాంటిక్ ట్రాక్‌లు ఎప్పటిలాగే ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతున్నాయి. పైకి విమర్శలు చేసినా, ఇలాంటి సన్నివేశాలు చూడగానే నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నామని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
