బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ విజేత పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్ధిపేట గజ్వేల్‌లోని అతని నివాసం నుంచి ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారు. అన్నపూర్ణ స్డూడియో దగ్గర గొడవ నేపథ్యంలో అతనిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. 

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ విజేత పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్ధిపేట గజ్వేల్‌ మండలం కొల్లూరులోని అతని నివాసం నుంచి ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారు. అన్నపూర్ణ స్డూడియో దగ్గర గొడవ నేపథ్యంలో అతనిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు పోలీసులు. పల్లవి ప్రశాంత్‌పై 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతనితో పాటు ప్రశాంత్ సోదరుడు రవిరాజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిగ్‌బాస్ ఫైనల్ ముగిసిన అనంతరం జూబ్లీహిల్స్‌లో పల్లవి ప్రశాంత్ అభిమానులు బీభత్సం సృష్టించారు. ఆ సమయంలో జరిగిన గొడవలో పలు కార్లు సహా, ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. 

కాగా.. కింగ్ నాగార్జున బిగ్ బాస్ సీజన్ 7 ని ఉల్టా పల్టా అని ఏ ముహూర్తాన అన్నారో కానీ ప్రస్తుతం వివాదాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిన తర్వాత కూడా ఆ వేడి తగ్గకపోగా కొత్త కాంట్రవర్సీలు పుట్టుకొస్తున్నాయి. రసవత్తరంగా సాగిన సీజన్ 7లో చివరకి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. బుల్లితెర నటుడు అమర్ దీప్ రన్నరప్ గా నిలవగా శివాజీ మూడవ స్థానంతో సరిపెట్టుకున్నారు. గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత జరిగిన సంఘటనలు ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. హౌస్ లో జరిగిన సంఘటనలు కేవలం గేమ్ లో భాగం మాత్రమే. కానీ అభిమానులు ఆ గోడలని విడిచిపెట్టకుండా కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యేలా రచ్చ చేశారు. 

పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్ ల కారు అద్దాలని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్, అమర్ ఫ్యాన్స్ రెచ్చిపోయి దాడులకు దిగారు. ఆర్టీసీ బస్సుల్ని కూడా ధ్వంసం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమర్ దీప్ కారులో తాన్ కుటుంబ సభ్యులతో ఉన్న సమయంలో అభిమానులు దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టారు. అమర్ దీప్ కుటుంబ సభ్యులని బూతులు తిట్టడం వరకు ఈ వివాదం వెళ్ళింది. ఫ్యాన్స్ చేసిన అతి ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై అమర్ దీప్ మాట్లాడుతూ తనతో మాత్రమే గొడవ పెట్టుకోవాలంటే ఎంత దూరం అయినా వస్తానని.. కుటుంబ సభ్యులని లాగవద్దని చెప్పాడు. 

అంతకుముందు తాను పారిపోయినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని.. తాను ఇంట్లోనే ఉన్నట్టు వీడియోలో చూపుతూ.. ప్రకటించాడు పల్లవి ప్రశాంత్‌. తాను ఇంట్లోనే ఉన్నన్నట్లు వీడియో విడుదల చేశారు. నేను ఊరు విడిచి ఎక్కడికీ వెళ్లిపోలేదు. కావాలంటే మా ఊరివాళ్లను అడగండి అంటూ..తనతో పాటు కొంత మందిని పక్కనే పెట్టుకుని వీడియో సందేశం చేశాడు. నాపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు భారీగా జనాలు వచ్చారు. పోలీసులహెచ్చరికలు నాకు సరిగ్గా వినబడలేదు అని తన వీడియోలో చెప్పుకొచ్చాడు ప్రశాంత్. 

తనపై నెగెటీవ్ ప్రచారం జరుగుతుందని.. ననుబ్యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రశాంత్‌ ఎక్కడికి వెళ్లలేదని నిన్న అయ్యప్ప పడిపూజకు వెళ్లాడంటు కుటుంబ సభ్యులు.. స్నేహితులు అన్నారు. ఇక అటు పల్లవి ప్రశాంత్ తన తరుపున లాయర్ ను రంగంలోకి దింపాడు. పల్లవి ప్రశాంత్ అడ్వకేట్ రాజేష్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని..కేసు నమోదు చేసి కనీసం నిందితుడికి FIR కాపీ ఇవ్వడం లేదని ఆరోపించారు. FIR కాపీ వారు ఇవ్వాల్సింది పోయి.. కుటుంబ సభ్యులు రావాలి అని చెబుతున్నట్లు వివరించారు.

ఇక FIR కాపీ లేకపోవడంతో బెయిల్‌కు దరఖాస్తు చేసుకోలేకపోతున్నట్లు తెలిపారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ పాత్ర ఏంటో FIR కాపీ చూస్తే తెలుస్తుందన్నారు అడ్వకేట్ రాజేష్ కుమార్. ప్రస్తుతం ఈ మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు సీపీఐ నారాయణ కూడా గట్టిగా స్పందించారు. ఈ బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలని అన్నారు. ఈ షో హోస్ట్ నాగార్జున పై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.