ఈ వారం నామిషన్స్ లో ఫైమా, రాజ్‌ తప్ప మిగిలిన వాళ్లంతా ఉన్నారు. రేవంత్‌, శ్రీహాన్‌, ఆదిరెడ్డి, శ్రీ సత్య, రోహిత్‌, మెరినా, ఇనయ, కీర్తి నామినేషన్స్ లో ఉన్నారు. అయితే వీరిలో ఎలిమినేషన్‌ ప్రక్రియ రసవత్తరంగా ఉండబోతుందట.

బిగ్‌ బాస్‌ 6 తెలుగు పదకొండో వారం ముగింపు చేరుకుంది. మరో నాలుగు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో షో మరింత రసవత్తరంగా మారింది. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. గత వారం వాసంతి ఎలిమినేట్‌ కావడంతో హౌజ్‌లో కొంత గ్లామర్‌ తగ్గిపోయింది. అయితే పదకొండో వారంలోనూ మరో గ్లామర్‌ ఎలిమినేట్‌ కాబోతుందని తెలుస్తుంది. 

ఈ వారం నామిషన్స్ లో ఫైమా, రాజ్‌ తప్ప మిగిలిన వాళ్లంతా ఉన్నారు. రేవంత్‌, శ్రీహాన్‌, ఆదిరెడ్డి, శ్రీ సత్య, రోహిత్‌, మెరినా, ఇనయ, కీర్తి నామినేషన్స్ లో ఉన్నారు. అయితే వీరిలో ఎలిమినేషన్‌ ప్రక్రియ రసవత్తరంగా ఉండబోతుందట. ఈ వారం అతితక్కువ ఓట్లు వచ్చిన వారు ఎలిమినేట్‌ అవుతారనే విషయం తెలిసిందే. ఇందులో శ్రీసత్య, మెరీనాల మధ్య తీవ్ర మైన పోటీ నెలకొనబోతుందట. రోహిత్‌ కూడా డేంజర్‌ జోన్‌లోనే ఉన్నారని అంటున్నారు. 

రోహిత్‌, శ్రీ సత్య, మెరీనా అతి తక్కువ ఓట్లు వచ్చాయి. వీరికి తొమ్మిది శాతం కంటే తక్కువ ఓట్లే నమోదైనట్టు తెలుస్తుంది. ఈ ముగ్గురిలో ఎక్కువ శాతం వచ్చిన రోహిత్‌ సేఫ్‌ కాబోతున్నాడని, చివరికి శ్రీసత్య, మెరీనాల మధ్య పోటీ ఉంటుందని, ఉత్కంఠభరితమైన సస్పెన్స్ అనంతరం మెరీనా ఎలిమినేట్‌ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. మెరీనా పదకొండో వారం ఎలిమినేట్‌ కాబోతుందని అంటున్నారు. అలాగే ఓటింగ్‌ పర్సెంటీజిలోనూ ఆమెకి తక్కువగా ఉండటం ఎలిమినేషన్‌ ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 

కానీ ఇందులో మరో విచిత్రమైన వాదన వినిపిస్తుంది. శ్రీసత్యని ఎలిమినేట్‌ చేయాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తుండటం గమనార్హం. ఆమె ఆట తీరు సంతృప్తికరంగా లేదని ఆమెని ఎలిమినేట్‌ చేయాలనే కామెంట్లు చాలా వినిపిస్తుండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. మెరినా ఎలిమినేట్‌ అయితే బిగ్‌ బాస్‌ 6 హౌజ్‌లో మరింత అందం తగ్గిపోతుందని చెప్పొచ్చు. చూడ్డానికి బుట్టబొమ్మలా ఉంటుంది మెరినా. నిజాయితీగా గేమ్ ఆడుతూ రాణిస్తుంది. కానీ చివరికి ఆమె సూపర్‌ 10 గా నిలిచి ఎలిమినేట్‌ కాబోతుండటం గమనార్హం.