Asianet News TeluguAsianet News Telugu

'బిగ్ బాస్ 4 ' కంటెస్టెంట్స్.. క్వారంటైన్ కండీషన్

బిగ్ బాస్ 4కి సంబంధించిన ఆఫీషియల్ లోగోను కూడా విడుదల చేసింది. ఈ హంగామా చూస్తూంటే...మరో రెండు మూడు వారాల్లో షో మొదలు కానుందని అర్దమవుతోంది. ఈ నేపధ్యంలో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపధ్యంలో 15 మంది సెలబ్రిటీల లిస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వైరల్ అవుతున్న లిస్టు ఏంటో ఓ లుక్కేద్దాం.

Bigg boss 4 telugu contestants list
Author
Hyderabad, First Published Jul 21, 2020, 7:30 PM IST

మూడు సీజన్స్ ని విజయవంతంగా గా పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్  త్వరలో నాలుగో సీజన్ మొదలు కాబోతుంది. ఈ మేరకు నాలుగో సీజన్ గురించి స్టార్‌ మా అధికారిక ప్రకటనను విడుదల చేసింది.. అంతేకాకుండా బిగ్ బాస్ 4కి సంబంధించిన ఆఫీషియల్ లోగోను కూడా విడుదల చేసింది. ఈ హంగామా చూస్తూంటే...మరో రెండు మూడు వారాల్లో షో మొదలు కానుందని అర్దమవుతోంది. ఈ నేపధ్యంలో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపధ్యంలో 15 మంది సెలబ్రిటీల లిస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వైరల్ అవుతున్న లిస్టు ఏంటో ఓ లుక్కేద్దాం.
  
మొదట తరుణ్, శ్రద్ధాదాస్, ఝాన్సీ, రష్మీ గౌతమ్, వర్షిణి పేర్లు ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇప్పుడు హైపర్ ఆది, స్టార్ సింగర్స్ సునీత, మంగ్లీ, హీరో నందు, తాగుబోతు రమేష్, వైవా హర్ష, అఖిల్ సార్ధక్ పేర్లూ వినిపిస్తున్నాయి. వీళ్లు మాత్రమే కాక‌.. మ‌రికొంత‌మంది మాజీ హీరోయిన్ల పేర్లూ ప‌రిశీలిస్తున్నారు అని వినికిడి. అంతేకాదు బిత్తిరి స‌త్తి పేరు కూడా ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.మరి వీళ్ల‌లో ఎవ‌రు ఫైనల్ అన్న‌ది ఇంకొన్ని రోజులు ఆగితే తెలిసిపోతుంది.

కాకపోతే కరోనా బయిట ఓ ఊపు ఊపుతోంది. దాంతో ప్రభుత్వ నిబంధనలు ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటూనే పకడ్భందీగా ఈ షోని నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. దాంతో ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ రెండు వారాలు ముందుగానే బిగ్ బాస్ హౌస్‌లో ఉండాలనే కండీషన్ పెట్టారట! అక్కడ డాక్టర్లు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులని చెక్ చేస్తారట! ఇష్యూస్ ఏమీ లేకపోతే వారితోనే షోని కంటిన్యూ చేస్తారట నిర్వాహకులు.! అదీ విషయం.

Follow Us:
Download App:
  • android
  • ios