బిగ్ బాస్ సీజన్ 3లో సోమవారం రోజు నిర్వహించిన టెలిఫోన్ టాస్క్ ఆకట్టుకుంది. ఇంటి సభ్యులని టెలిఫోన్ ద్వారా నేరుగా నామినేట్ చేసిన బిగ్ బాస్ ఆ తర్వాత సేవ్ చేసే అవకాశాన్ని కల్పించాడు. శ్రీముఖిని సేవ్ చేయడానికి బాబా భాస్కర్ గడ్డం షేవ్ చేసుకున్నాడు. పునర్నవి కోసం రాహుల్ 20 గ్లాసుల కాకరకాయ రసం తాగడం, హిమజ కోసం వరుణ్ పేడ తొట్టెలో పడుకోవడం ఆకట్టుకుంది.

ఇక బాబా కోసం మంచోడు రవి తనకిష్టమైన షూని రంగుల్లో ముంచాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయా మహేష్ విషయంలో హిమజ ప్రవర్తించిన విధానం మాత్రం అనుమానాలకు తావిస్తోంది. మహేష్ నామినేషన్ నుంచి సేవ్ కావాలంటే హిమజ తన వద్ద ఉన్న బట్టలు, మేకప్ కిట్ స్టోర్ రూమ్ కి పంపేయాల్సి ఉంటుంది. 

మొదట అలాగే చేస్తానని చెప్పిన హిమజ తన బట్టలు, మేకప్ కిట్ ని స్టోర్ రూమ్ లో వదిలేసింది. ఆతర్వాత కెప్టెన్ వితిక వెళ్లి చెక్ చేయగా ఇంకా హిమజ వద్ద బట్టలు, మేకప్ సామాన్లు ఉన్నాయి. దీనితో మహేష్ నేరుగా నామినేట్ కావాల్సి వచ్చింది. 

హిమజ అన్నింటిని స్టోర్ రూంలో పెట్టడం నిజంగానే మరచిపోయిందా లేక కావాలనే మహేష్ ని ఇరికించిందా అనే అనునాలు ఉన్నాయి. దీనితో హిమజపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. సంగం సగం పనులు చేసి మహేష్ నామినేట్ అయ్యేలా చేసిందని కొందరు విమర్శిస్తున్నారు. హిమజ తన ప్లాన్ లో భాగంగానే మహేష్ ని ఇరికించిందని కొందరు అంటున్నారు. 

హిమజ మద్దతు దారులు మాత్రం ఆమె అలాంటి కన్నింగ్ కాదని.. పొరపాటున లా జరిగిందని అంటున్నారు. వాస్తవానికి మహేష్ ని సేవ్ చేయాలనే మంచి ఉద్దేశమే ఆమెకు ఉండిందని అంటున్నారు. ఈ సంఘటనతో మహేష్, హిమజ మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.