బిగ్ బాస్ సీజన్ 3 ఐదో వారం పూర్తి చేసుకోబోతుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయం మరికొద్ది గంటల్లో తేలనుంది. అయితే ఈ వారం ఇంటి నుండి వెళ్లేది ఎవరనే విషయంలో ఇప్పటికే లీకులు వచ్చాయి. దీంతో షోపై ఆసక్తి సన్నగిల్లుతుండడంతో హౌస్‌మేట్స్‌తో ఫన్నీ టాస్క్‌లు చేయించి వీక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

వారాంతంలో నాగార్జున వచ్చి.. హౌస్‌మేట్స్‌ తో మాట్లాడుతూ.. కొన్ని హెచ్చరికలు, సూచనలు ఇవ్వడం చేస్తుంటాడు. ఈ ఆదివారం నాడు షోని మరింత ఎంటర్టైనింగ్ గా మలిచారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రోమోలు సోషల్‌ మీడియాలో నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.

ఒకరి క్యారెక్టర్‌ను మరొకరు ప్లే చేస్తుండడంతో మంచి ఎంటర్టైన్మెంట్ పండిందనే చెప్పాలి. వరుణ్‌ సందేశ్‌ పునర్నవిలా.. పునర్నవి వరుణ్‌సందేశ్‌లా, రాహుల్‌లా శ్రీముఖి నటించడం ఫన్‌ను క్రియేట్‌ చేసేలా ఉంది.

ఇక బాబా భాస్కర్‌కు తెలుగు సరిగా రాకపోవడంతో హౌస్‌మేట్స్‌ పేర్లను కరెక్ట్‌గా పలకలేకపోతున్నాడు. ఈ క్రమంలో నాగార్జున పేరును నాగరాజు అని మార్చేశాడని శివజ్యోతి నాగ్‌కు ఫిర్యాదు చేస్తోంది.