బిగ్ బాస్ సీజన్ 3 పది ఎపిసోడ్ లను ముగించుకొని పదకొండో ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. బుధవారం నాటి షో విషయానికొస్తే.. శ్రీముఖి, బాబా భాస్కర్ మధ్య సరదా సన్నివేశాలతో ఎపిసోడ్ మొదలైంది. తమన్నా చీపురు పట్టుకొని అలీ రాజాకి చుక్కలు చూపించింది. స్నానం చేసి టవల్ బయటకి వస్తున్న అలీని చూస్తూ తమన్నా.. హౌస్ లో ఈ ఎక్స్‌పోజింగ్ ఏంటి అంటూ ప్రశ్నించింది. 

నాకు నచ్చిన బట్టలు వేసుకునే హక్కు నాకు లేదా బిగ్ బాస్ అంటూ సరదాగా మాట్లాడాడు అలీ. నువ్ అలా విప్పుకొని తిరిగితే కుదరదని తమన్నా అనడంతో.. నా డ్రెస్ గురించి మీరు ఎందుకు అడుగుతున్నారు..? మీ డ్రెస్ ల గురించి నేనేం మాట్లాడలేదు కదా అంటూ సమాధానమిచ్చాడు. ఇది ఇలా ఉండగా.. తమన్నా ప్లేట్ లో తిని అది క్లీన్ చేయలేదని ఆమెని టార్గెట్ చేయడంతో.. ఓ రేంజ్ లో ఫైర్ అయింది.

ఇక్కడ ఎవడూ పెత్తనం చేయొద్దు.. నేను ప్లేట్ లో తినలేదు.. బౌల్ లో తిన్నాను.. అది క్లీన్ చేశా అంటూ హౌస్ మేట్స్ కి వార్నింగ్ ఇచ్చింది. ఇక లగ్జరీ బడ్జెట్ టాస్క్ ని మహేశ్, శ్రీముఖి, అలీ, వితికాలకు ఇవ్వగా.. వారు విజయవంతంగా దాన్ని పూర్తి చేశారు. ఇక బిగ్ బాస్ రెండో వారంలో జైలు శిక్షను మొదలుపెట్టారు. దీనికోసం హౌస్ లో ఉన్న పదిహేను మంది కంటెస్టెంట్స్ లో చెత్త పెర్ఫార్మన్స్ ఇచ్చిన ఇద్దరి పేర్లు సూచించాలని బిగ్ బాస్ ఆదేశించగా.. ఎవరూ పేర్లు చెప్పడానికి ముందుకు రాకపోవడంతో తమన్నా, వరుణ్ లు తమకు తామే చెత్త పెర్ఫార్మన్స్ గా ప్రకటించుకొని బిగ్ బాస్ కి తమ పేర్లు చెప్పారు.

దీంతో బిగ్ బాస్ ఈ ఇద్దరినీ తదుపరి ఆదేశం వచ్చేంతవరకు జైలులో ఉండాలని చెప్పారు. అలా జైలుకి వెళ్లిన తమన్నా తనకు ఏసీ లేకపోతే నిద్ర పట్టదంటూ ఏడ్చేసింది.