బుధవారం నాడు బిగ్ బాస్ ఎపిసోడ్ లో టాలెంట్ షో నిర్వహించారు బిగ్ బాస్. బాబా భాస్కర్, శ్రీముఖిలకు జడ్జిలుగా పెట్టి మిగిలిన సభ్యులతో డాన్స్, యాక్టింగ్ ఇలా పెర్ఫార్మన్స్ చేయించారు. ‘పిల‌గా ఇర‌గ ఇర‌గ’ సాంగ్‌కి పునర్నవి డాన్స్‌తో ఇర‌గదీసింది.

డాన్స్ అయిన త‌ర్వాత జ‌డ్జ‌స్ బాబా భాస్క‌ర్‌, శ్రీముఖీలు ఆమెపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆ తరువాత అషూ.. జిల్ జిల్ జిల్ జిగేలురాజా సాంగ్‌కి అదిరిపోయేలా డాన్స్ చేసింది. ఆమె డాన్స్‌కి జ‌డ్జ్ శ్రీముఖీతో పాటూ బాబా కూడా షాక్ అయ్యాడు. అంతగా తన డాన్స్ తో మెప్పించింది.

ఇక వితికా క‌ళ్లు లేని అమ్మాయిలా న‌టించి.. క‌ళ్లు డొనేట్ చెయ్యండి అని ఇచ్చిన ప‌ర్ఫామెన్స్ ఇంటి స‌భ్యుల్లో భావోధ్వేగాల‌ను రేకెత్తిస్తే.. శివజ్యోతి మాయ చేస్తా అంటూ చేసిన పెర్ఫార్మన్స్ అందరినీ నవ్వించింది. ఇక తర్వాత వ‌చ్చిన హిమ‌జ‌.. ఓ చ‌క్క‌నోడా సాంగ్ సాంగ్‌ని త‌ప్పు త‌ప్పుగా పాడుతూ.. ఆగి ఆగి పాడుతూ.. కాస్త కష్టపడింది.

సింగర్ అయిన రాహుల్ పాట పాడలేకపోవడం, గివ్ అప్ చేయడంతో ఎందుకు ఇలా చేస్తున్నాడంటూ పునర్నవి.. వరుణ్ తో చర్చిస్తుంది. ఇక మహేశ్ బిగ్ బాస్ ఎవరనే టాపిక్ తీసుకొని. బిగ్ బాస్ అంటే.. ప్ర‌తి మ‌నిషిలో ఉండే అంత‌రాత్మ‌ అంటూ తన స్పీచ్ తో ముగించాడు.