బిగ్ బాస్ సీజన్ 3 ఆరోవారం మొదలైంది. పదహారు మంది కంటెస్టెంట్స్ మొదలైన షోలో పదకొండు మంది మిగిలారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ కి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఎపిసోడ్ ప్రారంభంలో పునర్నవితో ముచ్చట్లు పెట్టాడు రాహుల్.

తనతో వాదనకు దిగిన పునర్నవికి ఊహించని షాక్ ఇచ్చాడు రాహుల్. బయట నీలాంటోళ్లు బొచ్చుడు మంది ఉన్నారు. అసలు నువ్ నాకు ఏమి అవుతావ్ చెప్పు. నువ్ ఆఫ్ట్రాల్ ఫ్రెండ్‌వి మాత్రమే. నాకోసం కోసుకునే వాళ్లు ఉన్నారు అంటూ పునర్నవికి గాలి తీసేశాడు రాహుల్.

దీంతో వీరిద్దరినీ కలపాలని వరుణ్, వితికాలు గట్టి ప్రయత్నమే చేశారు. కానీ ఇద్దరూ రాజీ పడలేదు. ఈవారం ఎలిమినేషన్స్‌లో భాగంగా.. శివజ్యోతిని మినహాయించి..  హౌస్‌లో మిగిలిన పది మంది సభ్యుల్ని ఇద్దరిద్దరుగా డివైడ్ కావాలని ఆదేశించారు. దీంతో రవి-అలీ, శ్రీముఖి-హిమజ, వరుణ్-పునర్నవి, రాహుల్-వితికా, బాబా భాస్కర్‌- మహేష్‌‌లు జోడీ కట్టారు.

ఈ జంటల్లో ఒకర్ని సేవ్ చేసి మరొకరిని నామినేట్ చేయాలని చెప్పగా.. హౌస్ మేట్స్ బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం చేశారు. ఫైనల్ గా రాహుల్, హిమజ, పునర్నవి, రవి, మహేష్‌,  వరుణ్ సందేశ్ లు ఈ వారం నామినేట్ అయ్యారు.