బిగ్ బాస్ 3 బుధవారం నాటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ చేసిన రచ్చ ప్రేక్షకులు తట్టుకోలేకపోయారు. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ‘ఛలో ఇండియా’ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం బిగ్ బాస్ హౌస్‌లో ఉంచిన బిగ్ బాస్ ఎక్స్ ప్రెస్‌లో ఇండియాలో వివిధ ప్రాంతాలను సందర్శిస్తారు. 

ఈ టాస్క్ లో రవి, పునర్నవి హనీమూన్ జంటగా.. అందమైన అమ్మాయిగా శ్రీముఖి కనిపిస్తుంది. ఆమె టూర్ మేనేజర్ అలీకి సైట్ కొడుతూ ఉంటుంది. శ్రీముఖి పొట్టి నిక్కరుతో పూర్తిగా ఎక్స్‌పోజ్ చేస్తూ గేమ్ ప్రకారం అలీని లైన్‌లో పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. 

హనీమూన్‌కి వచ్చిన జంటగా రవి, పునర్నవిలు జీవించేశారు. ఒకరినొకరు కౌగిలించుకొని తెగ రొమాన్స్ చేశారు. ఇక అమాయకుడైన భర్తగా మహేష్, నోరేసుకుని పడిపోయే భార్యగా హిమజ పాత్రలకు న్యాయం చేశారు. గురువారం నాడు కూడా ఈ టాస్క్ కంటిన్యూ అవుతుండడంతో ఇంకెంత రచ్చ చేస్తారో చూడాలి!

ఇది ఇలా ఉండగా.. ఈవారం ఎలిమినేషన్‌లో తొలుత ఆరుగురు నామినేట్ కాగా.. ఈ ఆరుగురిలో ముగ్గురికి మినహాయింపు ఇచ్చి మహేష్, పునర్నవి, హిమజలు ఎలిమినేషన్‌లో ఉంచారు. ఈ ముగ్గురిలో ఒకరు ఈవారం బిగ్ బాస్ హౌస్‌ను వీడుతుండగా ఆ ఒక్కరు ఎవరన్నది ఆసక్తిగా మారింది.