బిగ్ బాస్ సీజన్ 3 పదో వారం పూర్తి చేసుకోబోతుంది. ఇక ఈ వారంలో నామినేషన్ ప్రక్రియ ఎంతో ఆసక్తికరంగా మారింది. నలుగురు కంటెస్టంట్లు శ్రీముఖి, బాబా భాస్కర్, రవిక్రిష్ణ, వరుణ్ సందేశ్‌లు ఈవారం నామినేషన్స్‌లో ఉండటంతో ఫైట్ కాస్త టఫ్ అయింది.

అయితే ఎప్పటిలానే హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయం బయటకి  వచ్చేసింది. ఈసారి లీకువీరుల కంటే జనాలే ముందుగా గెస్ చేసేశారు. ఉన్న నలుగురిలో శ్రీముఖికి ఢోకా లేదనేది మొదటి నుండి వినిపిస్తున్న మాట. ఆమె ఎలిమినేషన్ కి వెళ్లిన ప్రతీసారి సేవ్ అవుతూనే ఉంది. 

ఆమెతో పాటు ప్రస్తుతం హౌస్ లో ఉన్న బలమైన కంటెస్టంట్ వరుణ్ సందేశ్ కూడా నామినేషన్స్ లో ఉన్నాడు. అతడు ఓటింగ్ లో టాప్ పొజిషన్ లో ఉన్నాడు. ఇక మిగిలిన ఇద్దరిలో బాబా భాస్కర్, రవికృష్ణలలో రవి కాస్త వీక్ అని చెప్పాలి. బిగ్ బాస్ ఫస్ట్ వీక్ నుండి సేఫ్ గేమ్ ఆడుతూ మంచోడిగా పేరు తెచ్చుకున్న రవి నామినేషన్స్ లోకి పెద్దగా వెళ్లలేదు.

కానీ పదో వారంలో వితికాతో తలపడి నామినేషన్స్ లోకి వచ్చాడు. అతడికి ఫాలోయింగ్ తక్కువగా ఉండడంతో అందరికంటే తక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. హౌస్ మేట్స్ అందరూ కూడా ఈ వారం రవి ఎలిమినేట్ అవ్వడం ఖాయమని ఫిక్స్ అయి ఉన్నారు. వారి ఊహకు తగ్గట్లే బయట పరిస్థితులు కూడా ఉన్నాయి. సో.. ఈ వారం రవికృష్ణ ఎలిమినేట్ అవ్వడం ఖాయమన్నమాట!