బిగ్ బాస్ సీజన్ 3లో నాలుగో వారం శుక్రవారం ఎపిసోడ్ లో రక్షాబంధన్ సంబరాలు జరిగాయి. ఇందులో భాగంగా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అన్నాచెల్లెల్లుగా తమ మధ్య ప్రేమను చాటారు. వరుణ్ సందేశ్ కి హిమజ.  రవికి రోహిణి రాఖీ కట్టగా.. మహేష్‌కి అషు.. అలీకి శివజ్యోతి రాఖీ కట్టి ఎమోషనల్ అయ్యారు.

అయితే పునర్నవి ఎవరికి రాఖీ కడుతుందనగా.. అతనిలో మా తమ్ముడ్ని చూస్తున్నా అంటూ పునర్నవి రాహుల్ వైపు చూడటంతో.. రాహుల్ ఒక్కసారిగా టెన్షన్ పడ్డాడు. కానీ ఇంతలో వరుణ్ సందేశ్ ని ఉద్దేశిస్తూ ఆ మాట అన్నట్లు పునర్నవి చెప్పడంతో రాహుల్ కూల్ అయ్యాడు. దీంతో హౌస్ లో వారంతా నవ్వేశారు.

పునర్నవి.. వరుణ్ కి రాఖీ కట్టి తమ్ముడు అని పిలిచింది. హౌస్ లో ఉన్నవారందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఒక్క రాహుల్ కి తప్ప అంటూ అతడిని టీజ్ చేసింది పునర్నవి. ఆమె మాటలు విన్న మిగిలిన కంటెస్టంట్స్ అరుస్తూ రాహుల్ ని ఏడిపించారు. రక్షాబంధన్ వేడుకలు పూర్తయిన తరువాత బాబా భాస్కర్ కోసం స్పెషల్ మెసేజ్ అంటూ బిగ్ బాస్ ఓ వీడియో ప్లే చేశారు.

అందులో బాబా భార్య మాట్లాడుతూ కనిపించింది. తన భర్తకు జాగ్రత్తలు చెప్పడంతో పాటు గేమ్ ని గేమ్ లా ఆడాలని సలహా ఇచ్చింది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నరనే విషయాన్ని సస్పెన్స్ గా ఉంచుంటూ శనివారం ప్రోమోని చూపించారు!