బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. మన టీవీ ద్వారా శుక్రవారం హౌస్‌లో ఏం జరిగిందో నాగార్జున చూడటంతో పాటు ప్రేక్షకులకు చూపించారు. పునర్నవి, వితికా, వరుణ్ సందేశ్ కలిసి రాహుల్ పెళ్లి గురించి డిస్కస్ చేసుకున్నారు. వచ్చే ఒకటి రెండేళ్లలో పెళ్లి చేసుకోవాలని లేదంటే లేట్ అయిపోతుందని, 33 సంవత్సరాలంటే లేట్ అయినట్లేనని మాట్లాడుకున్నారు.

33 అంటే ఎవరు చేసుకుంటారంటూ పునర్నవి కూడా ఒక కామెంట్ చేసింది. ఇలా మాట్లాడుకుంటున్న సమయంలో వారి దగ్గరకి రవి, రాహుల్ వచ్చారు. రవి దగ్గర వితికా పెళ్లి గురించి మాట్లాడుతూ.. నీకు అమ్మాయికి మధ్య ఎంత గ్యాప్ కావాలని ప్రశ్నించింది. దానికి రవి రెండు సంవత్సరాలు అని చెప్పాడు. దానికి వరుణ్.. ఈయనకి సిక్స్ ఇయర్స్ ఉండాలంట అంటూ రాహుల్ ని చూపించాడు.

వెంటనే రాహుల్.. ఇదేళ్లు మినిమమ్ అని అన్నాడు. మినిమమ్ ఫైవ్ అంటే సిక్స్, సెవెన్ ఇయర్స్ పర్వాలేదు అయితే అంటూ వరుణ్ వెటకారంగా మాట్లాడాడు. ఇక బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని రింగులో జాక్ పాట్ అనే గేమ్ ఆడించారు. మన టీవీ ద్వారా ఇంటి సభ్యులను పలకరించిన నాగార్జున వారి ముందు 'దోషి-నిర్దోషి' అనే కాన్సెప్ట్ పెట్టారు.

ఈ క్రమంలో హౌస్ మేట్స్ ఒక్కొక్కరికి ఇంట్లో ఎవరితోనైనా కంప్లైంట్స్ ఉన్నాయో లేవో తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ కి నామినేషన్ అయిన రవి, రాహుల్, శ్రీముఖి, అలీ, మహేశ్ లలో రాహుల్ సేవ్ అయినట్లు చెప్పారు.