బిగ్ బాస్ మూడో సీజన్ ఐదో వారంలో ఎంటర్ అయింది. సోమవారం నాడు ఎప్పటిలానే ఎలిమినేషన్ కి నామినేషన్ ప్రక్రియ జరిగింది. అలీ కెప్టెన్ కావడంతో అతడికి మినహాయింపు లభించింది. దీంతో పాటు ఆయనకి నలుగురిని నేరుగా నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చారు.

దీంతో అలీ.. బాబా భాస్కర్, రాహుల్, హిమజ, వితికా పేర్లన సూచించారు. అలీ మనసుని మార్చి నామినేషన్స్ నుండి బయటపడటానికి ప్రయత్నించారు బాబా భాస్కర్. హిమజ-అలీలా మధ్య మళ్లీ కాసేపు చర్చ నడిచింది. తనను ఎందుకు నామినేట్ చేశావో అర్ధం కావడం లేదని హిమజ అడగడంతో నీకు అర్ధం కాదులే లైట్ తీసుకో అని చెప్పాడు.

మొదటిగా పునర్నవి.. హిమజ, రాహుల్‌ని నామినేట్ చేసింది. రాహుల్‌ని నామినేట్ చేస్తూ.. అతను గేమ్‌ని సీరియస్ తీసుకోవడం లేదని నాకు బిగ్ బాస్ కాకపోతే ఇంకో లైఫ్ ఉందని అనుకుంటున్నాడని కారణం చెప్పింది. హిమజని నామినేట్ చేస్తూ.. ఆమె ఎప్పుడూ నేను చేసిందే కరెక్ట్ అని వాదిస్తోంది అంటూ చెప్పుకొచ్చింది.

మొత్తంగా ఈ నామినేషన్ ప్రక్రియలో రాహుల్‌, హిమజలను ఎక్కువమంది నామినేట్ చేశారు. ఇక ఈవారం ఐదోవారంలో రాహుల్, హిమజ, అషు, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్‌లు ఎలిమినేషన్‌కి నామినేట్  అయ్యారు.