శనివారం ఎపిసోడ్ లో నాగార్జున గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. రాగానే నేను చాలా సీరియస్‌గా ఉన్నా.. కంటెస్టెంట్స్‌పై పీకల వరకూ ఉంది. వాళ్లతో చాలా మాట్లాడాలి అంటూ బిగ్ బాస్ హౌస్‌‌ని మన టీవీ ద్వారా షాకింగ్ ఎంట్రీ ఇచ్చారు. ఇంటి సభ్యుల్ని చూస్తూ తన షూ పాలిష్ చేసుకుంటూ వాళ్లకి క్లాస్ పీకాడు నాగార్జున.

''నా షూని నేను రోజూ పాలిష్ చేసుకోను. కాని నేను ఈరోజు పాలిష్ ఎందుకు చేస్తున్నా అంటే.. ఏ పని చిన్నది కాదు అని చెప్పడానికి. చేసే పనిని బట్టి మనిషి స్థాయి తగ్గడం పెరగడం ఉండదు. చేసే తీరుని బట్టే ఉంటుంది'' అని మహేశ్, పునర్నవిలకు క్లాస్ పీకారు.

మహేశ్ లేచి నిలబడు అని చెప్పిన నాగ్.. ''షూ పాలిష్ చేయడం, డ్రాయర్‌లు ఉతకడం అంటూ ఏదేదో మాట్లాడావు. మాకు ఇవన్నీ అవసరమా? అంటున్నావ్. నువ్ ఏమీ ఇక్కడ ఇరగదీయడం లేదు. ఇన్విటేషన్ మీద వచ్చావా? నీ ఇన్విటేషన్ క్యాన్సిల్ చేస్తున్నా.. బిగ్ బాస్ డోర్లు తెరుస్తున్నా.. నువ్ ఇప్పుడే వెళిపోవచ్చు'' అంటూ మహేశ్ పై సీరియస్ అయ్యారు.

నువ్ కన్విన్స్ అయి టాస్క్ చేసినందుకు మాత్రమే నిన్ను బిగ్ బాస్ హౌస్ లో ఉంచుతున్నామని నాగార్జున.. మహేశ్ తో అనడంతో అతడు కుదుటపడ్డాడు. బిగ్ బాస్ ని బూతులు తిట్టిన పునర్నవిపై నాగార్జున ఫైర్ అయ్యారు. దీంతో క్షమాపణలు చెప్పింది పునర్నవి. ఇక శ్రీముఖిపై కూడా నాగార్జున సీరియస్ అయ్యారు. ''నువ్ వచ్చింది ఆట ఆడటానికి తప్ప ఆడించేందుకు కాదు. నువ్ బిగ్ బాస్‌వి కాదు. నీకు గేమ్ ఆడటం ఇష్టం లేకపోతే పక్కకి తప్పుకో.. దయచేసి మ్యానుప్యులేట్ చేయకు'' అని చెప్పారు.