శనివారం ఎపిసోడ్ లో ఎప్పటిలానే నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు. హౌస్ మేట్స్ ఏం చేస్తున్నారో మన టీవీ ద్వారా చూపించారు. అనంతరం వారితో మాట్లాడాడు. ఈవారం టాస్క్‌లో భాగంగా వరుణ్, రాహుల్‌ల మధ్య కొట్లాట జరగ్గా.. గాయాలను చూసి ఎవరికి ఎక్కడ దెబ్బలు తగిలాయి. ఎలా తగిలాయి? అన్నదాన్ని గమనించాల్సిందిగా ఇంట్లోకి డాక్టర్‌ని పంపించి మరీ క్లాస్ పీకడం మొదలుపెట్టారు నాగార్జున.

దీంతో వరుణ్, రాహుల్ ఒకరికొకరు సారీ చెప్పుకోవడంతో గొడవ సద్ధుమణిగింది. రాహుల్‌తో వరుణ్ గొడవపడిన తరువాత ఈవారం రోజుల్లో తనతో ఎక్కువ టైం వరుణ్ ఉన్నాడని కామెంట్ చేసింది వితికా. అది విన్న నాగ్.. 'అందుకే ఇద్దరి మధ్య గొడవ పెట్టావా?' అంటూ చురకలేశారు. 

పునర్నవి తిట్లదండకానికి సంబంధించిన వీడియోను ప్లే చేసి ఆమెపై సెటైర్‌ వేశాడునాగ్. బయటకు వెళ్లాక తిట్ల కోచింగ్‌ సెంటర్‌ పెట్టుకోవచ్చని అన్నారు. ప్రతీది కామెడీ  చేస్తున్నాడని బాబాపై ఆగ్రహం వ్యక్తం చేశారు నాగ్.

ఇక రాహుల్, వరుణ్ గొడవని వాడుకుంటున్నావని శ్రీముఖిని ఉద్దేశిస్తూ మాట్లాడారు నాగార్జున. ఇక నామినేషన్‌లో ఉన్న శ్రీముఖి, బాబా భాస్కర్‌, వరుణ్‌, రవిలలో వరుణ్‌  సేవ్‌ అయినట్లు నాగ్ ప్రకటించారు.