బిగ్ బాస్ సీజన్ 3 ఐదో వారంలోకి ఎంటర్ అయింది. ఐదో వారం నామినేషన్స్ లో ఏడుగురు ఉండడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయంపై ఆసక్తి నెలకొంది. బాబా భాస్కర్‌ను అలీ నామినేట్ చేయడంపై హౌస్‌లో చర్చ మొదలైంది. 

బాబా భాస్కర్ చాలా బాధ పడ్డారని వరుణ్ తో శ్రీముఖి చెప్పగా.. వారిద్దరూ కలిసి బాబా, అలీల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. మధ్యలో మహేష్ కల్పించుకుని ఆయన ఫీల్ అయ్యారని అనడంతో నువ్ మధ్యలో పుల్లలు పెట్టకు అని నోరు జారడంతో మహేష్ సీరియస్ అయ్యారు.

ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటూ.. ఒకరి మీదకు మరొకరు కొట్టుకోవడానికి వెళ్లేలా ప్రవర్తించడంతో సిట్యుయేషన్ సీరియస్ అయిపోయింది. మహేష్, అలీలను బాబా భాస్కర్, వరుణ్‌లు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

''మాట్లాడితే పుల్లలు పెడుతున్నా.. అని అంటున్నారు? నా వల్ల హౌస్‌లో ఎవరైనా కొట్టుకున్నారా? అసలు నన్ను అనడానికి నువ్ ఎవడివి? నేను నీ ఇంటికి రాలేదు.. బిగ్ బాస్ ఇంటికి వచ్చా.. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు దెబ్బలు తింటావ్'' అంటూ అలీకి వార్నింగ్ ఇచ్చాడు మహేష్.  

దీంతో బాబా భాస్కర్ కల్పించుకొని మహేష్ ని బయటకు తీసుకువచ్చేశాడు. ఇక రాహుల్ సైతం తనను నామినేట్ చేయడంపై బాబా భాస్కర్, మహేష్‌ల దగ్గర బాధపడ్డారు.