శుక్రవారం నాటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కి డిన్నర్ పార్టీ ఇస్తానని వారితో గేమ్ ఆడించాడు బిగ్ బాస్. ఇంటి సభ్యుల్ని ఒక్కొక్కరుగా సీక్రెట్ రూంలోకి పిలిచి అక్కడ వాళ్లతో వివిధ రకాల యాక్టివిటీజ్ చేయించి.. దాన్ని బయట ఉన్న ఇంటి సభ్యులతో చెప్పాలని వాళ్లు చెప్పింది నిజమో అబద్దమో కరెక్ట్‌గా గెస్ చేయాలని అన్నారు. ఈ ప్రాసెస్ లో రాహుల్ సీక్రెట్ రూంలోకి వెళ్లిన తరువాత ఆయనతో సిటప్స్ తీయించారు బిగ్ బాస్.

ఇక బయటకు వెళ్లి మీకు మీ అమ్మ ఫోన్ చేసిందని.. పెళ్లి సంబంధం కోసం మాట్లాడిందని  నమ్మించాలని టాస్క్ ఇవ్వడంతో రాహుల్ బిగ్ బాస్ బాస్ చెప్పినట్టే నమ్మించాడు. మిగిలిన అందరి విషయాల్లో కరెక్ట్ గా గెస్ చేసిన శ్రీముఖి.. రాహుల్ విషయంలో కరెక్ట్ గా గెస్ చేయలేకపోయింది. రాహుల్ గుండెలపై తల పెట్టి అతని హార్ట్ బీట్ విని.. రాహుల్ నిజమే చెప్తున్నాడని డిసైడ్ చేసింది.

వరుణ్, వితికా, హిమజ ఇలా కొంత మంది రాహుల్‌ చెప్పేది అబద్ధమనిపిస్తుందని చెప్పగా.. శ్రీముఖితో కలిపి ముగ్గురు మాత్రమే నిజం అని చేతులు ఎత్తారు. నేను చెప్తున్నాగా.. మీరు అబద్ధం అనుకుంటే మనకు బొక్కపడుతుందని అనడంతో అనుమానంగా ఇంటి సభ్యులు నిజమే అని చేతులు ఎత్తారు. అయితే అది తప్పని బిగ్ బాస్ చెప్పడంతో అందరూ తెల్లమొహాలు వేశారు.

దీంతో వరుణ్.. శ్రీముఖిపై విరుచుకుపడ్డాడు. నువ్ అనుకుంనే అనుకోవాలని కానీ మిగిలిన వాళ్లని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావని మండిపడ్డాడు. దీంతో శ్రీముఖి.. నా లాంగ్వేజ్ అంతే అని అరిచి చెప్పింది. దీంతో వరుణ్.. 'ఎప్పుడూ నువ్ మాట్లాడడమే కాదూ.. ఎదుటివారి మాటలను కూడా వినాలని' సలహా ఇచ్చాడు. నీ అభిప్రాయాన్ని అందరిపై ఎందుకు రుద్దుతున్నావు అంటూ సీరియస్ అయ్యాడు.