బిగ్ బాస్ సీజన్ 3 పదో వారంలోకి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. మంగవారం నాడు బిగ్ బాస్ 'అత్తరాజ్యంలో కోడళ్ల కష్టాలు' అనే టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ బుధవారం నాడు కూడా కంటిన్యూ అయింది. అత్తగా శివజ్యోతి.. వరుణ్, రాహుల్ సిప్లిగంజ్, రవిక్రిష్ణలు కొడుకులుగా.. వితికా, పునర్నవి, శ్రీముఖిలు కోడల్లుగా తమ పాత్రల్లో జీవించేస్తున్నారు.

ఈ టాస్క్ లో భాగంగా శివజ్యోతి.. తన కొడుకులకు ఓ పని చెప్పింది. ఆమె ఇచ్చిన కొన్ని ఇటుకులతో గోడ కట్టాలని.. ఎవరు ముందుగా ఎక్కువ ఇటుకలతో గోడ కడతారో వాళ్ళకే తన ఆస్థి ఇస్తా అనడంతో గోడకట్టడం కోసం ఇటుకల కోసం ఒకరితో ఒకరు కొట్లాటకు దిగారు. ఈ క్రమంలో వరుణ్ కొన్ని ఇటుకలు తీసుకొని వెళ్తుండగా.. రాహుల్ అడ్డుకున్నాడు. 

ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. ఇద్దరూ బల ప్రదర్శనకు దిగారు. మధ్యలో వితికా కూడా ఎంటరై రాహుల్‌ని గిచ్చడంతో రాహుల్.. వరుణ్‌ని ఎత్తి పక్కకు నెట్టాడు. దీంతో ఈ టాస్క్ కాస్త కొట్లాటకి దారితీసింది. రాహుల్, వరుణ్ ఎన్నడూ లేని విధంగా ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకునే వరకు వెళ్లారు. మధ్యలో వితికా.. రాహుల్ ని గోళ్లతో గిచ్చడంతో అతడి ఒంటిపై గాయాలయ్యాయి.

నిన్నటి వరకూ ఒక గ్రూప్ గా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న రాహుల్, వరుణ్ లు ఈ టాస్క్ తో దూరమయ్యారు. తన అగ్రిసివ్‌ నెస్‌ను వరుణ్ టార్గెట్ చేస్తాడని అస్సలు ఊహించలేదని పునర్నవి దగ్గరఫీల్ అయ్యాడు రాహుల్. ఓ పక్క వీళ్లు గొడవ పడుతుంటే.. శ్రీముఖి చీర లోపల ఇటుకలు పెట్టుకొని గోడ కట్టేసింది. ఈ టాస్క్ ఈరోజు కూడా కంటిన్యూ అవుతుండడంతో ఇంకెంత రచ్చ జరుగుతుందో చూడాలి!