తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ముస్తాబవుతోంది. బుల్లితెర ప్రేక్షకులకు మరింత వినోదం అందించేలా బిగ్ బాస్ 3ని నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. త్వరలో బిగ్ బాస్ 3 షో ప్రారంభం కానున్న నేపథ్యంలో హోస్ట్, కంటెస్టెంట్స్ కి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ నిర్వాహకులు త్వరలో అధికారిక ప్రకటన చేసునేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. 

విక్టరీ వెంకటేష్ హోస్ట్ గా దాదాపుగా ఖాయం అయ్యారని సమాచారం. ఇక కంటెస్టెంట్స్ గురించి కూడా కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, రెండవ సీజన్లో ఆ బాధ్యతలని నాని నిర్వహించాడు. మూడవ సీజన్ కోసం కొందరి స్టార్ హీరోల పేర్లు వినిపించాయి. చివరకు బిగ్ బాస్ యాజమాన్యం వెంకటేష్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 

బుల్లితెర నటుడు జాకీ, కమల్ కామరాజు, బ్యాట్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల, వరుణ్ సందేశ్ లాంటి సెలెబ్రిటీలు మూడవ సీజన్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వివరాలన్నింటినీ బిగ్ బాస్ నిర్వాహకులు త్వరలో మీడియా సమావేశం నిర్వహించి ప్రకటించనున్నారు.