బిగ్ బాస్ సీజన్ 3 ఏడు వారాలు పూర్తి చేసుకోబోతుంది. ఎప్పటిలానే ఈ వారం కూడా ఇంటి నుండి ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన లీకులు ముందే బయటకి వచ్చేస్తున్నాయి.

ఈ రియాలిటీ షోని హైదరాబాద్ లో చిత్రీకరించడం, ఒకరోజు ముందుగానే షూటింగ్ పూర్తి చేస్తుండడంతో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నరనే విషయాలు బయటకి తెలిసిపోతున్నాయి. ఏడువారాలు ముగిసిన బిగ్‌బాస్ షోలో ఆరో ఎలిమినేష‌న్‌ కి రంగం సిద్ధమైంది.

రాహుల్, రవి, శ్రీముఖి, అలీ రెజా, మహేష్ లు ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ కాగా.. శనివారం ఎపిసోడ్ లో రాహుల్ సేఫ్ అయినట్లు తెలిసింది. మరి మిగిలిన నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారనే విషయంలో అలీ రెజా పేరు వినిపిస్తోంది.

ఈ ఏడు వారాల్లో ఒక్కసారి కూడా నామినేషన్ కు వెళ్లని అలీ రెజా మొదటిసారి నామినేట్ అయి ఇప్పుడు ఎలిమినేట్ కాబోతున్నాడని సమాచారం. ఇప్పటివరకు ఎలిమినేషన్ పై వచ్చిన వార్తలన్నీ కూడా కరెక్ట్ అయ్యాయి. మరి ఈ వారం అలీ రెజా ఎలిమినేషన్ ఖాయమైందో లేదో.. మరికొద్ది గంటల్లో తేలనుంది!