బిగ్ బాస్ సీజన్ 3 నాలుగో వారంలోకి ఎంటర్ అయింది. నేటి ఎపిసోడ్‌లో ఈ కెప్టెన్ టాస్క్‌లోని లెవెల్-2ను బిగ్ బాస్ ప్రవేశపెట్టారు. ఈ టాస్క్‌లో గెలిచిన అలీ రెజా హౌజ్‌కు కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక శ్రీముఖి, రోహిణిల మధ్య ఎలిమినేషన్ విషయంలో చిన్న వాదన జరిగింది.

'ఈ వారం నువ్ వెళ్లిపోతావే' అని రోహిణితో శ్రీముఖి అంది. 'ఫ్రెండ్ అయి ఉండి ఎలిమినేట్ అయిపోతానని మొహం మీద ఎలా అంటావ్.. ఎలిమినేట్ అవుతావేమో అనడం వేరు.. నువ్ కచ్చితంగా వెళ్లిపోతావ్ అని చెప్పడం వేరు' అంటూ రోహిణి బాధ పడింది.

దీనికి శ్రీముఖి.. 'మన్నా విషయంలో నేను ఊహించిందే జరిగింది. ఇప్పుడు అదే విధంగా అనాలసిస్ చేశాను. అంతే.. నువ్వు ఎలిమినేట్ అయిపోతావ్ అని నేను చెప్పడం లేదు' అంటూ చెప్పుకొచ్చింది. దీనికి రోహిణి మరింత బాధపడింది. బెడ్ రూమ్ లోకి వెళ్లిపోయి కంటతడి పెట్టుకుంది రోహిణి. విషయం తెలుసుకున్న అషురెడ్డి, వితికాలు శ్రీముఖిని ప్రశ్నించారు.

దీంతో శ్రీముఖి.. 'రోహిణి నేను ఫ్రెండ్స్.. దాన్ని ఎలా ఓదార్చాలో నాకు తెలుసు.. మేం చూసుకుంటాం.. మీరు కలుగజేసుకోవద్దు' అని స్ట్రాంగ్ గా చెప్పింది. ఆ తరువాత రోహిణిని శ్రీముఖి ఓదార్చడం మొదలుపెట్టింది. రోహిణికి క్షమాపణలు చెప్పడంతో విషయం సద్దుమణిగింది.