బిగ్‌బాస్ సీజన్ 2కి గ్లామర్ తెచ్చిన నందిని రాయ్, అసలు ఈమె ఎవరు?

Bigg Boss 2: Who is nandini Roy?
Highlights

హౌస్‌లోకి ప్రవేశించిన మొదటి రోజే షోలో అందాలను ఆరబోసిన నందినీరాయ్ పక్కా హైద్రాబాదీ.

బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 2లో గడచిన ఆదివారం కామనర్‌గా వచ్చిన మోడల్ సంజనా ఎలిమినేట్ కావడంతో ఆమె స్థానాన్ని భర్తీ చేసేందుకు మరో మోడల్, హీరోయిన్ నందినీ రాయ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి ప్రవేశించిన సంగతి మనందరికీ తెలిసిందే.

గతంలో జరిగిన బిగ్‌బాస్ సీజన్ 1లో షోకి మరింత గ్లామర్‌ను అద్దేందుకు దీక్షా పంత్‌ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రవేశ పెట్టారు.  కాగా ఇప్పుడు అదే తరహాలోనే బిగ్‌బాస్ రెండవ సీజన్‌లో కూడా నందినీ రాయ్‌ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. హౌస్‌లోకి ప్రవేశించిన మొదటి రోజే షోలో అందాలను ఆరబోసిన నందినీరాయ్ పక్కా హైద్రాబాదీ.

హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది.  నందినీ రాయ్ సెయింట్ ఆల్బన్స్ హై స్కూల్‌లో చదువుకుంది. ఆ తర్వాత ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్ వెళ్లింది. ఫైనాన్స్‌లో ఎంబీఏ పూర్తి చేసిన నందినీ రాయ్‌కి మోడలింగ్ అంటే ఆసక్తి. ఆ ఆసక్తితోనే సినీ రంగ ప్రవేశం కూడా చేసింది. 

ఈ అందాల భామ 2008లో మిస్ హైదరాబాద్, 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్, 2009లో మిస్ పాంటలూన్స్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఏపి, 2010లో మిస్ బ్యూటిఫుల్ ఐస్ ఆఫ్ ఏపి టైటిల్స్ దక్కించుకుంది. నందినీ రాయ్ ఫ్యామిలీ ప్యాక్ అనే హిందీ సినిమా ద్వారా 2011లో వెండితెరకు పరిచయమైంది.

తెలుగులో 040, హార్మోన్స్, మాయా, మోసగాళ్లకు మోసగాడు మొదలైన చిత్రాలతో పాటుగా పలు తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా నటించింది. మరి ఈ అందాల భామ హౌస్‌లో ఎలాంటి సందడి చేస్తుందో, ఎంతకాలం కొనసాగుతుందో వేచి చూడాలి.

loader