టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2కు సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘ఎఫ్3’. రిలీజ్ కు సిద్ధమైన ఈ చిత్రం నుంచి మేకర్స్ వరుస అప్డేట్స్ అందిస్తూ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు.  తాజాగా బిగ్ అప్డేట్ అందించారు.  

‘ఎఫ్2’తో తెలుగు ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నారు అనిల్ రావిపూడి (Anil Ravipudi). దానికి సీక్వెల్ గా వుస్తున్న చిత్రం ‘ఎఫ్3’ (F3). ఈ మూవీతో మరోసారి నవ్వుల పండుగ ప్రారంభం కానుంది. మొదటి పార్ట్ లో ఫ్యామిలీతో కలిగే ఫ్రస్టేషన్ ను చూపించారు. ఈ సారి మనీతో మనుషులకు కలిగే ఫ్రస్టేషన్ ను హాస్యరూపకంగా ‘ఎఫ్3’ ద్వారా చూపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ ఇప్పటికే పూర్తయ్యి రిలీజ్ కు అన్ని విధాలా సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, మేకింగ్ వీడియోస్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. 

ఎఫ్3 కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆడియెన్స్ ను ఖుషీ చేసేందుకు మేకర్స్ తాజాగా క్రేజీ అప్డేట్ అందించారు. రేపు ఉదయం 10 :08 గంటలకు చిత్రం నుంచి టీజర్ లేదా ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ మేరకు.. ‘ఫన్ బాంబ్ పేలేందుకు సిద్ధమైంది.. రేపు ఉదయం 10:08 నిమిషాలకు బ్లాక్ కానుంది’ అంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే రేపు ఎలాంటి సర్ ప్రైజ్ ఇవ్వనున్నారో వేచి చూడాలి. ఈ చిత్ర రిలీజ్ కు ఇంకాస్త సమయం ఉండటంతో చిత్ర ప్రచార కార్యక్రమాలపై ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికలు వేస్తున్నారు టీం.

కాగా, ఇప్పటి వరకు ఎఫ్ 3 నుంచి ఫస్ట్ సింగిల్ గా ‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బూ..’ మరియు స్పెషల్ సాంగ్ ‘ఊ ఆ అహా అహా’ సాంగ్ ను రిలీజ్ చేశారు. సెకండ్ సింగిల్ ఇప్పటికే 10 మిలియన్ వ్యూస్ ను దక్కించుకొని దూసుకుపోతోంది. చిత్రంలో హీరోహీరోయిన్లుగా విక్టరీ వెంకటేశ్(Venkatesh), వరుణ్ తేజ్ (Varun Tej), తమన్నా భాటియా (Tamannaah), మెహరీన్ ఫిర్జాదా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ మే 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 

Scroll to load tweet…