చెట్టుకు కట్టిన చీర ఊయలతో ఆడుకుంటూ ఉండగా ఆ చీర మెలిపడి చిన్నారి మెడకు బిగుసుకుపోయింది. అనంతరం నిమిషాల్లోనే పిల్లాడు మరణించాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా కోడూరు మండలంలో శనివారం చోటుచేసుకుంది. పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు రావడంతో వారు ఊయల దగ్గరకు వెళ్లి ఆటలాడారు. ఈ క్రమంలోనే ఓ పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు.

అమరావతి: క్రిస్మస్ సెలవుల సందర్భంగా మిత్రులతో కలిసి ఇంటి వెనుకాల చెట్టుకు చీరను కట్టి ఏర్పాటు చేసిన ఊయలలో ఆడుకున్నారు. ఇలా ఆడుకుంటుండగా చీరను మెలికలు వేస్తూ గుండ్రంగా తింపాడు. ఈ క్రమంలోనే బాలుడి మెడకు చీర గట్టిగా చుట్టుకుని ఊపిరాడకుండా చేసింది. చీర బిగుసుకుపోవడంతో మిత్రులు చూస్తుండగా పిల్లాడు మరణించాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా కోడూరు మండలంలో శనివారం జరిగింది.

కోడూరిలోని అంబటి బ్రాహ్మణయ్య కాలనీకి చెందిన రామాంజనేయులు, అంజలీ దేవి దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడి పేరు చైతన్య, రెండో కుమారుడి పేరు బాలవర్దన్. చిన్న కుమారుడు వడ్డెర కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా పాఠశాలలకు సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సెలవులు వచ్చినందునే అన్నదమ్ములు చైతన్య, బాలవర్దన్‌లు కాలనీలోని ఇతర మిత్రులతో కలిసి ఆడారు. తమ ఇంటి వెనుక ప్రాంతంలో చెట్టుకు చీరతో కట్టిన ఊయలలో ఆడేందుకు చైతన్య, బాలవర్దన్‌లు మిత్రులతో కలిసి వచ్చారు.

Also Read: అక్క కుటుంబానికి దగ్గరై మెప్పు పొందాలని.. కోడలి కిడ్నాప్.. చివరికి అరెస్టై జైలుకు.. ఎక్కడంటే...

చైతన్య హుషారుగా ఊయలలోకి ఎక్కి ఆడాడు. అలా ఆడుకుంటూనే చీరను మెలిపెట్టాడు. ఊయలను గుండ్రంగా తింపాడు. అంతే.. అది తన ప్రాణం తీసింది. చీర గట్టిగా మెడకు బిగుసుకుపోవడంతో తోటి స్నేహితులు చూస్తుండగానే చైతన్య ఊపిరి వదిలాడు. చీర మధ్యలో మాట్లాడకుండా విగత జీవిలా మారిపోయాడు. భయంతో చిన్నారులు పరుగున వెళ్లి చైతన్య తల్లిదండ్రులకు విషయం చెప్పారు. తల్లిదండ్రులు వెంటనే ఊయల దగ్గరకు వెళ్లారు. కానీ, చైతన్య అప్పటికే ప్రాణాలు వదిలేశాడు.

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం నూనావంత్ తండాకు చెందిన గేరు కిషన్(35), భూలక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు హర్షవర్దన్(8), అఖిల్(6)లు ఉన్నారు. తండాలో కిషన్‌కు ఒక ఎకరం పొలం ఉన్నది. ఇది సాగు చేసి కుటుంబ బాధ్యతలు నెరవేర్చేవాడు. ఆర్థిక సమస్యల కారణంగా దంపతుల మధ్య గొడవలు జరిగేవి. బతుకు దెరువు కోసం మూడేళ్ల క్రితం భార్యాపిల్లలతో కలిసి కిషన్ మిర్యాలగూడకు వెళ్లాడు. అక్కేడ ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. ఇటీవలే వారు మళ్లీ స్వగ్రామానికి తిరిగి వచ్చారు. స్వగ్రామంలోనే పిల్లలను బడికి పంపారు. గురువారం పిల్లలు బడి నుంచి ఇంటికి రాగానే కిషన్ ఆటో స్టార్ట్ చేశాడు. కొత్త బట్టలు కొనిస్తానని, మిర్యాలగూడకు వెళ్దామని పిల్లలతో చెప్పాడు. కొత్త బట్టలు అనగానే పిల్లలు ఎగిరి గంతేశారు. రెడీ అయి ఆటో ఎక్కారు.

Also Read: హైదరాబాద్‌ : బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య.. సైలెంట్‌‌గా మృతదేహం ఆసుపత్రికి తరలింపు, ఉద్రిక్తత

మిర్యాలగూడకు వెళ్తామని ఇంటి నుంచి బయల్దేరి వెళ్లిన పిల్లలు, భర్త రాత్రి అయినా తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగింది. రాత్రి వరకూ ఎదురుచూసి వారు రాకపోయే సరికి ఇరుగు పొరుగులో రాత్రిపూట వారి జాడ కోసం వెతికారు. కానీ, ఫలితం లేకపోయింది. అయితే, శుక్రవారం ఉదయం పొలాలకు వెళ్లిన స్థానికు రైతులకు అసలు విషయం తెలిసి వచ్చింది. చిన్నారులు ఇద్దరూ విగత జీవులై పడి ఉండగా, కిషన్ బాడీ ఉరితాడుకు వేళాడుతూ కనిపించింది. దీంతో రైతులు వెంటనే వారి కుటుంబ సభ్యులకు, పోలీసులకు విషయాన్ని చేరవేసింది. 

ఇద్దరు పిల్లలకు కూల్ డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చి చంపేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాతే తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఘటనా స్థలికి వచ్చిన కిషన్ భార్య, తల్లిదండ్రులు ఆవేదనతో గుండలవిసేలా రోధించారు. పోస్టుమార్టం కోసం డెడ్ బాడీలను ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. తన కొడుకు మరణానికి ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలే కారణమని కిషన్ తల్లి పోలీసులకు వివరించింది.