Asianet News TeluguAsianet News Telugu

భారతీయుడు 2 నుండి అదిరిపోయే అప్డేట్... శంకర్ సడన్ సర్ప్రైజ్!

కమల్ హాసన్ ఫ్యాన్స్ కి దర్శకుడు శంకర్ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు.  భారతీయుడు 2 నుండి ఫస్ట్ మేజర్ అప్డేట్ వస్తుంది. 
 

big surprise to kamal haasan fans update from bharateeyudu 2 ksr
Author
First Published Oct 29, 2023, 2:52 PM IST

నవంబర్ 7 లోకనాయకుడు కమల్ హాసన్ పుట్టినరోజు. ఆయన 69 ఏట అడుగుపెట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని భారతీయుడు 2 నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. నవంబర్ 3వ తేదీన భారతీయుడు 2 ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేస్తున్నారు. భారతీయుడు 2 ని పరిచయం చేయబోతున్నామని ఓ పోస్టర్ విడుదల చేశారు. కమల్ హాసన్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కి ఇది కిక్ ఇచ్చే న్యూస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

1996లో విడుదలైన భారతీయుడు ఆల్ టైం బ్లాక్ బస్టర్. తెలుగు, తమిళ భాషల్లో ఆ చిత్రం నయా రికార్డ్స్ సెట్ చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్ దశాబ్దాల అనంతరం శంకర్ తెరకెక్కిస్తున్నారు. భారతీయుడు 2 వివాదాలతో మధ్యలో ఆగిపోయింది. నిర్మాతలతో దర్శకుడు శంకర్ కి విభేదాలు తలెత్తాయి. అలాగే సెట్స్ లో ప్రమాదం జరిగి ఒకరు మరణించారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారతీయుడు 2 పక్కన పెట్టేశారు. 

విక్రమ్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన కమల్ హాసన్ తిరిగి ఫార్మ్ లోకి వచ్చాడు. ఈ క్రమంలో భారతీయుడు 2 నిర్మాతలు షూటింగ్ తిరిగి ప్రారంభించారు. శంకర్ తో నిర్మాతలు సయోధ్య కుదుర్చుకున్నారు. భారతీయుడు 2 విడుదల తేదీపై ఇంకా క్లారిటీ లేదు. ఏక కాలంలో శంకర్ భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ చిత్రాలను తెరకెక్కిస్తున్నాడు. 

కమల్ హాసన్ కి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ సైతం ఓ రోల్ చేస్తుంది. హీరో సిద్ధార్థ్ సైతం నటిస్తున్నట్లు సమాచారం. కోలీవుడ్ లో భారతీయుడు కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. మరి ఆ సినిమాకు సీక్వెల్ అంటే అంచనాలు భారీగా ఉంటాయి. ఒకప్పటి స్వాతంత్య్ర సమరయోధుడిగా కమల్ హాసన్ పాత్ర చెరగని ముద్ర వేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios