హీరోయిన్ ఆదాశర్మ ఓ వర్గం నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ది కేరళ స్టోరీ మూవీలో నటించిన కారణంగా ఆమెకు సోషల్ మీడియాలో వేధింపులు ఎదురవుతున్నాయి.
దర్శకుడు సుదీప్తో సేన్ ది కేరళ స్టోరీ టైటిల్ తో మూవీ తెరకెక్కించారు. ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఆదాశర్మ హీరోయిన్ గా నటించారు. కేరళ రాష్ట్రంలో లవ్ జిహాద్ పెద్ద ఎత్తున జరుగుతుంది. హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలను ముస్లిం యువకులు ప్రేమించి వాళ్ళను ఉగ్రవాదులుగా మారుస్తున్నారనే అంశాలను ది కేరళ స్టోరీ మూవీలో చూపించారు. దీంతో రాజకీయ వర్గాలు, ముస్లిం కమ్యూనిటీ ఈ చిత్రాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
హీరోయిన్ గా నటించిన ఆదా శర్మకు వేధింపులు ఎక్కువయ్యాయి. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా ఆదాశర్మ వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియాలో పెట్టాడు. ఆదాశర్మ ఫోన్ నెంబర్ సైతం లీక్ చేశాడు. ముస్లింలకు వ్యతిరేకంగా ఇకపై చిత్రాలు చేస్తే పర్యవసానాలు ఇంకా దారుణంగా ఉంటాయని హెచ్చరించాడు. సదరు వ్యక్తిపై ఆదాశర్మ సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశారు.
కాంట్రవర్సీ ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది. ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేని ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తుంది. ఆదాశర్మ దాదాపు ఫేడ్ అవుట్ దశలో ఉంది. ఆమెకు ఓ భారీ హిట్ సరైన సమయంలో పడింది. ఇది కమర్షియల్ మూవీ కాదు. కాబట్టి ది కేరళ స్టోరీ విజయం ఆదాశర్మకు అవకాశాలు తెచ్చిపెడుతుందని చెప్పలేం.
ఆదాశర్మ తెలుగులో హార్ట్ ఎటాక్,సన్ ఆఫ్ సత్యమూర్తి, క్షణం, కల్కి చిత్రాల్లో నటించింది. ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ హిందీలో ఎక్కువ చిత్రాలు చేశారు. ఆదాశర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తరచుగా వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తుంటారు.
